ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ప్రతిరోజూ కొత్త బైక్ మోడళ్లు విడుదలవుతుండటంతో వినియోగదారులు ఏది ఎంచుకోవాలన్న దానిపై అయోమయానికి గురవుతున్నారు. ఎక్కువగా లుక్స్, స్పీడ్, ఫీచర్లకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, రోజువారీ ప్రయాణాలకు ముఖ్యమైనది నమ్మకమైన పనితీరు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు. ఈ నేపథ్యంలో రోజూ ఆఫీసు లేదా వ్యాపార అవసరాల కోసం ఉపయోగించడానికి అనువైన, తక్కువ ఖర్చుతో నడిచే టాప్-5 బైకుల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. మొదటగా Yamaha MT-15 V2 యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ బైక్ స్టైలిష్ లుక్‌తో పాటు శక్తివంతమైన 155cc ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ట్రాఫిక్‌లో కూడా సులభంగా నడపగలిగే ఈ బైక్, హై పెర్ఫార్మెన్స్‌తో పాటు మంచి రిలయబిలిటీని అందిస్తుంది.