‘కాంతార’లాంటి అడవి.. కాపలా కాస్తున్న నాగదేవత

‘కాంతార’లాంటి అడవి.. కాపలా కాస్తున్న నాగదేవత


అచ్చం ‘కాంతార’ సినిమా తరహాలోనే హిమాచల్‌ ప్రదేశ్‌లోని అడవిని రింగు నాగ్‌ అనే నాగదేవత రక్షిస్తోంది. అటవీ మాఫియా వల్ల చుట్టుపక్కల కొండలన్నీ ఎండిపోయినా, రింగు వన్‌ ఇప్పటికీ పచ్చదనంతో కళకళలాడుతుంది. దీన్ని సాక్షాత్తు యునెస్కో బృందం గతంలో గుర్తించింది. ఈ దేవత పాము, సింహం, పొట్టేలు.. ఇలా మూడు రూపాల్లో కనిపిస్తుంది. స్థానికులు నాగ పంచమి సందర్భంలో మాత్రమే ఉపవాసంతో అడవిలోకి ప్రవేశిస్తారు. కాంతార మూవీలో ఒకవైపు ప్రభుత్వ వ్యవస్థ, అభివృద్ధి ప్రాజెక్టులు, మరోవైపు స్థానిక దేవతలు, అటవీ నమ్మకాలు ఉంటాయి. ఇక్కడ కూడా అంతే. రింగు వన్‌లోకి ప్రవేశించడం, చెట్లను కొట్టడం,ఎండు పుల్లలను ఏరుకోవడం నిషిద్ధం. ఎవరైనా అడవిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తే రింగు నాగ్ దేవత శిక్షిస్తుందని స్థానికులు బలంగా నమ్ముతారు. దేవత రక్షణలో ఉన్నందు వల్లే అడవిలో అనేక అరుదైన జంతు, వృక్ష, పక్షి జాతులు నిర్భయంగా జీవిస్తున్నాయనీ స్థానికులు నమ్ముతారు. దేవదారు, అవాలు, తోష్, రాఖల్ వంటి అనేక విశిష్టమైన చెట్లు ఈ అడవిలో ఉన్నాయి. ఒకవేళ ఏదైనా పశువు మేత మేస్తూ ఈ అడవిలోకి వెళితే, దాన్ని తిరిగి తీసుకురావడానికీ వీలుండదు. దాదాపుగా ఆ పశువు రెండు మూడు రోజుల్లోనే తిరిగొస్తుంది. కొన్ని సందర్భాల్లో తిరిగి రాదు. ఒకవేళ తిరిగి రాకుంటే, దేవత ఆశ్రయాన్ని ఆ పశువు పొందిందని అర్థం చేసుకోవాలి. సజ వైశాఖ, నాగ పంచమి సందర్భాలలో మాత్రమే అడవిలోకి ప్రవేశిస్తారు. ఆ ప్రత్యేక సందర్భాల్లో అడవిలోకి వెళ్లేవారు ఉపవాసం పాటించాలి. స్నానం చేసి తల కప్పుకోవాలి. ఇంకా చాలా కఠిన నియమాలు పాటించాలి. స్నానం చేయకుండా, తల కప్పుకోకుండా అడవిలోకి ప్రవేశించడం ఇక్కడ నిషిద్ధం. కేంద్ర ప్రభుత్వం భారత్‌మాల ప్రాజెక్ట్ కింద కులు జిల్లాలోని పవిత్రమైన బిజ్లీ మహాదేవ్ కొండపై 3 కిలోమీటర్ల రోప్‌వే నిర్మాణానికి ఆమోదం తెలిపింది. మొదటి దశ నిర్మాణ పనులకు అనుమతినీ మంజూరు చేసింది. అయితే ఈ కొండపై రోప్‌వే నిర్మించడం వల్ల తమ మతపరమైన ఆచారాలకు, ప్రకృతికి హాని కలుగుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. 2025 జూలైలో ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానికులు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ రోప్‌వే నిర్మాణ పనులు 2026 నాటికి పూర్తి కావాల్సి ఉన్నా, ప్రజా వ్యతిరేకత, న్యాయపరమైన స్టేల కారణంగా పనులు పూర్తిగా ఆగిపోయాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. ఆ రోడ్డు పై ఘోస్ట్ సైకిల్‌.. తల, మొండెం లేకుండానే..

భార్య కోసం.. రేడియో టవర్ ఎక్కిన యువకుడు

వంద రోజులు ఒంటరి జీవితంపై ప్రయోగం!

వడదెబ్బ నుంచి రక్షణకు.. మంత్రి చిట్కా..

ఇంధన కొరత వేళ ఉచితంగా పెట్రోలు పంపిణీ.. ఎక్కడంటే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *