సాధారణ మోడళ్లకు పూర్తి భిన్నంగా యూరోపియన్ మార్కెట్ కోసం ప్రత్యేక హంగులతో ఆవిష్కరించబడిన Z 650 S, Z 900 S, Z 900 SE శ్రేణి బైక్‌లు అత్యంత ఆకర్షణీయమైన రంగుల కలయికతో ఆకట్టుకుంటున్నాయి. రైడర్లకు మరింత సౌకర్యవంతమైన ఎర్గోనామిక్స్‌ను, స్టైలిష్ లుక్‌ను కల్పిస్తున్న ఈ మార్కెట్లో బైక్‌లు భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ బైక్‌ల ప్రత్యేకతేంటో తెలుసుకుందాం.
కొత్త రంగుల విశేషాలు
కవాసకి సంస్థ 2025 చివర్లో యూరోపియన్ మార్కెట్ కోసం Z 650 S మోడల్‌ను పరిచయం చేయగా ఇది Z 650 ప్లాట్‌ఫామ్‌పై రూపొందినప్పటికీ డిజైన్ విషయంలో Z 900కు దగ్గరగా కనిపించేలా మార్పులు చేయడంతో పాటు వెడల్పు అయిన హ్యాండిల్‌బార్, రీపొజిషన్ ఫుట్‌పెగ్స్‌తో రైడర్‌కు మరింత సౌకర్యవంతమైన ఎర్గోనామిక్స్ అందించారు. 2027 మోడల్‌లో Z 650 S బ్లాక్, రెడ్, గ్రీన్ హైలైట్స్‌తో కూడిన వైట్ కలర్‌తో సహా మూడు కొత్త రంగుల్లో లభిస్తోంది అయితే భారత మార్కెట్‌లో ప్రస్తుతం ఇది అందుబాటులో లేదు. ఇక దేశంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న Z 900 మోడల్ కోసం యూరోపియన్ వెర్షన్‌లో గోల్డ్ హైలైట్స్ లేని పూర్తిగా బ్లాక్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ హైలైట్స్‌తో కూడిన వైట్ కలర్ వంటి మూడు కొత్త రంగులను తీసుకొచ్చి మరింత సూపర్ లుక్‌ను అందించారు.
భారతీయ మార్కెట్ లభ్యత
స్టాండర్డ్ Z 900తో పోలిస్తే మరింత ప్రీమియం పరికరాలు కలిగిన Z 900 SE మోడల్‌లో బ్రెంబో బ్రేకులు, ఓహ్లిన్స్ సస్పెన్షన్ లాంటి అప్‌గ్రేడ్‌లు ఉండగా దీన్ని గ్రే రంగులో కాంట్రాస్ట్ గ్రీన్ ఫ్రేమ్, గ్రీన్ వీల్స్‌తో అందిస్తున్నారు. కొత్త కలర్ ఆప్షన్లు మినహా ఈ మోడళ్లలో ఎలాంటి ఇంజిన్ లేదా మెకానికల్ మార్పులు చేయలేదు. అయితే యూరప్‌లో తీసుకొచ్చిన ఈ కొత్త కలర్లను ఇండియన్ మార్కెట్‌కు కవాసకి తీసుకొస్తుందా లేదా Z 650 S మోడల్‌ను భారత్‌లో లాంచ్ చేస్తుందా అనే అంశంపై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.