బాలీవుడ్ నటి కంగన రనౌత్ తన బోల్డ్ వ్యాఖ్యలతో తరచు వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల ఆమె సౌత్ సినిమాలపై, ఒరిజినల్ కంటెంట్‌పై, పని గంటలపై, హాలీవుడ్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. సౌత్ సినిమాలను ప్రశంసిస్తూ, అక్కడి మేకర్స్ తమ సంస్కృతిని, ప్రాంతీయతను విడిచిపెట్టకుండా సినిమాలు తీస్తున్నారని, అందుకే విజయవంతం అవుతున్నారని కంగన అన్నారు. ఉత్తరాది ప్రేక్షకులు సినిమాలతో డిస్కనెక్ట్ అయ్యారని ఆమె గతంలో చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు.ఇలాంటి ఒరిజినల్ కంటెంట్‌పై మేకర్స్ దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. రీసెంట్గా ఉత్తరాదిలో విడుదలైన దురంధర్ వంటి కంటెంట్ ప్రజలకు చేరువవుతుండడం ఆనందంగా ఉందని కంగన తెలిపారు. పని గంటల గురించి మాట్లాడుతూ, ఎంతసేపు పని చేయాలనేది వ్యక్తిగత విషయమని ఆమె అన్నారు. దీపిక పదుకొణె ఉదాహరణను ప్రస్తావిస్తూ, బిడ్డకు జన్మనిచ్చాక ఆమె పని గంటల విషయంలో నియమాలు పెట్టుకోవడం తప్పు కాదని కంగన పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
సడన్‌గా సైలెంట్ అయిన డార్లింగ్.. రీజనేంటి?
పూరి @26..మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా..?
పాన్ ఇండియా హిట్ వరమా..శాపమా?
ఊరిస్తున్న ఒక్క పాట.. పెద్ది టీమ్ ప్లానేంటి?
సమ్మర్ హీట్.. లైట్ అంటున్న స్టార్స్