ఒకే బిల్లు.. మొత్తం ఫ్యామిలీకి ఇంటర్నెట్‌! Vi తీసుకొచ్చిన ఫ్యామిలీ ప్లాన్‌ గురించి తెలుసా?

ఒకే బిల్లు.. మొత్తం ఫ్యామిలీకి ఇంటర్నెట్‌! Vi తీసుకొచ్చిన ఫ్యామిలీ ప్లాన్‌ గురించి తెలుసా?


భారత టెలికాం రంగంలో కీలక స్థానంలో ఉన్న వోడాఫోన్‌ ఐడియా (Vi), కుటుంబ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఆకర్షణీయమైన రూ.751 ఫ్యామిలీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. Vi Max ఫ్యామిలీ లైనప్‌లో భాగమైన ఈ ప్లాన్ ద్వారా, ఒకే బిల్లుతో రెండు లేదా అంతకంటే ఎక్కువ కనెక్షన్లను సులభంగా నిర్వహించుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ ప్లాన్‌లో నెలకు రూ. 751 చెల్లిస్తే, ఒకరు ప్రైమరీ యూజర్‌గా, మరొకరు సెకండరీ కనెక్షన్‌గా సేవలను పొందుతారు. అవసరమైతే ఒక్కొక్క అదనపు సభ్యుడిని రూ.299 చొప్పున జోడించవచ్చు. గరిష్టంగా ఏడుగురు వరకు అదనపు లైన్లు చేర్చుకునే వీలుంది, ఇది పెద్ద కుటుంబాలకు కూడా అనుకూలంగా మారుతుంది.

ప్రాథమిక కనెక్షన్‌కు అధిక ప్రయోజనాలు లభిస్తాయి. నెలకు 70GB డేటా, రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు అపరిమిత నైట్ డేటా, 200GB వరకు డేటా రోల్‌ఓవర్, నెలకు 3000 SMSలు, అపరిమిత వాయిస్ కాలింగ్ వంటి ఫీచర్లు అందిస్తారు. అదనంగా Vi గేమ్స్ యాక్సెస్ కూడా లభిస్తుంది. ఎక్కువ డేటా వినియోగించే వారికి ఈ ప్లాన్ సరైన ఎంపికగా ఉంటుంది. రెండో సభ్యుడికి కూడా 40GB డేటా, అపరిమిత కాలింగ్ లభిస్తుంది. SMS ప్యాక్‌ను ఇద్దరూ పంచుకుంటారు. ఇంట్లో మరొక యూజర్, ఉదాహరణకు పిల్లలు లేదా పెద్దలు ఎల్లప్పుడూ కనెక్ట్‌గా ఉండేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

ఇంకా కుటుంబ సభ్యులకు అవసరమైనప్పుడు ఉపయోగపడేలా అదనంగా 10GB షేర్డ్ డేటా కూడా ఈ ప్లాన్‌లో చేర్చారు. అవసరమైనప్పుడు ఎవరైనా దీనిని వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో OTT ప్రయోజనాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వినియోగదారులు అదనపు ఛార్జీలు లేకుండా రెండు డిజిటల్ బెనిఫిట్స్ ఎంచుకోవచ్చు. అందులో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (6 నెలలు), జియో హాట్‌స్టార్‌ (1 సంవత్సరం), సోనీLIV (360 రోజులు), అలాగే నార్టన్ మొబైల్ సెక్యూరిటీ వంటి ఎంపికలు ఉన్నాయి. అదనంగా Vi మూవీస్, టీవీ సేవ ద్వారా పలు OTT కంటెంట్‌కి యాక్సెస్ లభిస్తుంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *