
మనం ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినప్పుడు మనకు ఉండే అతిపెద్ద కలలు రెండు. ఒకటి, మన పిల్లలను గొప్పగా చదివించడం, రెండు.. మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండటం. అయితే ఈ రెండింటికీ భారీగా ఖర్చు అవుతుంది. చేతిలో ఉన్న పొదుపు మొత్తం దీనికి సరిపోదు. అప్పుడే మనకు ‘లోన్’ అనే ఆలోచన వస్తుంది. కానీ చాలామందికి ఉండే ఒక పెద్ద సందేహం ఏంటంటే.. “నేను ఇప్పటికే పిల్లల చదువు కోసం లోన్ తీసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ ఇంటి కోసం లోన్ ఇస్తారా?” లేదా “ఈ రెండూ ఒకేసారి అప్లై చేయొచ్చా?” అని. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
ఇది చదవండి: ఇది చిటికెడు వేస్తే చాలు.. మందార మొక్కకు వచ్చే తెల్లని పురుగులను తరిమి కొట్టొచ్చు..
నిజానికి, బ్యాంకులు మీకు లోన్ ఇచ్చేటప్పుడు చూసే ప్రధాన అంశం మీ ‘పేయింగ్ కెపాసిటీ’. అంటే, మీరు తీసుకున్న అప్పును తిరిగి కట్టే స్తోమత మీకు ఉందా లేదా అన్నది మాత్రమే వారు చూస్తారు. మీ నెలవారీ ఆదాయంలో 40 శాతం నుంచి 50 శాతం లోపు ఈఎంఐలు ఉంటే, మీరు ఎన్ని లోన్లకైనా అర్హులే. మీకు మంచి సిబిల్ స్కోర్ ఉండి, ఆదాయ మార్గాలు స్పష్టంగా ఉంటే ఎడ్యుకేషన్ లోన్, హోమ్ లోన్ రెండూ ఒకేసారి తీసుకోవచ్చు. అయితే, ఈ రెండింటిలో ఏది ముందు తీసుకోవాలి అని అడిగితే, ఎడ్యుకేషన్ లోన్‌కే ప్రాధాన్యత ఇవ్వమని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే చదువు అనేది భవిష్యత్తుపై చేసే పెట్టుబడి, ఇల్లు అనేది ఎప్పుడైనా కట్టుకోవచ్చు కానీ చదువుకునే సమయం తిరిగి రాదు కదా!
ఇక లోన్ ప్రక్రియలో సిబిల్ స్కోర్ ప్రాముఖ్యతను తక్కువ అంచనా వేయలేం. 750 కంటే ఎక్కువ స్కోర్ ఉంటే బ్యాంకులు వడ్డీ రేట్లలో కూడా రాయితీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులైతే ‘కో-అప్లికెంట్’గా చేరి జాయింట్ లోన్ తీసుకోవడం వల్ల ఎక్కువ మొత్తం లోన్ పొందే వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా మహిళల పేరు మీద లోన్ తీసుకుంటే ప్రభుత్వం మరియు బ్యాంకుల నుండి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు, తక్కువ వడ్డీ రేట్లు లభిస్తాయి. లోన్ తీసుకోవడం అనేది ఒక బాధ్యత, దాన్ని సరైన ప్లానింగ్‌తో చేస్తే మన కలలను సులభంగా సాకారం చేసుకోవచ్చు. చదువు ద్వారా వచ్చే జ్ఞానం, దాని ద్వారా పెరిగే ఆదాయం మనల్ని ఉన్నత స్థితికి చేరుస్తుంది.
ఇది చదవండి: వాటర్ ట్యాంక్ క్లీనింగ్ ఇక చిటికలో పని.. లోపలికి దిగకుండానే ఈజీగా శుభ్రం చేయండిలా.!