చాలా మంది ఏసీని ఆన్ చేయగానే 16 లేదా 18 డిగ్రీల వద్ద పెడతారు. ఇలా చేస్తే గది త్వరగా చల్లబడుతుందని వారి నమ్మకం. కానీ ఇది ముమ్మాటికీ పొరపాటే. ఏసీ టెంపరేచర్ తగ్గించడం వల్ల కంప్రెసర్ ఎక్కువ సమయం పనిచేస్తుంది తప్ప, గాలి వేగంగా చల్లబడదు. ఏసీని సమర్థవంతంగా వాడుతూ, విద్యుత్ బిల్లును అదుపులో ఉంచుకోవడానికి పాటించాల్సిన 5 ముఖ్యమైన చిట్కాలేంటో తెలుసుకుందాం.
సరైన ఉష్ణోగ్రత
ఏసీని ఎప్పుడూ 24–26 డిగ్రీల సెల్సియస్ వద్ద సెట్ చేయడం వల్ల గది హాయిగా ఉండటమే కాకుండా విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. ఇది కంప్రెసర్ మీద లోడ్ తగ్గిస్తుంది. అలాగే గదిలోని చల్లని గాలి కిటికీలు లేదా తలుపుల సందుల నుండి బయటకు పోకుండా చూడాలి. కిటికీలకు మందపాటి తెరలు వాడటం, తలుపుల కింద గ్యాప్స్ లేకుండా సీల్ చేయడం వల్ల ఏసీ లోపల ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది. దీనివల్ల ఏసీ పదే పదే కంప్రెసర్ ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు, ఫలితంగా బిల్లు తగ్గుతుంది.
ఫ్యాన్ వాడకం
ఏసీ ఫిల్టర్లలో ధూళి పేరుకుపోతే గాలి ప్రవాహం తగ్గి, చల్లదనం సరిగ్గా రాదు. దీనివల్ల అదే చల్లదనం కోసం ఏసీ ఎక్కువ పవర్‌ను వినియోగిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా ఫిల్టర్లను శుభ్రం చేయడం వల్ల ఏసీ లైఫ్ పెరగడమే కాకుండా పవర్ సేవ్ అవుతుంది. ఏసీతో పాటు సీలింగ్ ఫ్యాన్‌ను తక్కువ వేగంతో వాడటం వల్ల చల్లని గాలి గది అంతా సమానంగా వ్యాపిస్తుంది. దీనివల్ల తక్కువ సమయంలోనే గది చల్లగా అనిపిస్తుంది. మండుతున్న ఎండ సమయాల్లో కిటికీ తెరలు మూసి ఉంచడం, అవసరం లేనప్పుడు టైమర్ సెట్టింగ్స్ వాడటం ద్వారా అనవసరమైన విద్యుత్ వృధాను అరికట్టవచ్చు. ఏసీని తెలివిగా వాడటం వల్ల మనకు సౌకర్యంతో పాటు ఆర్థికంగానూ ప్రయోజనం ఉంటుంది. చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా ఈ వేసవిలో ఏసీ బిల్లు భారం లేకుండా ప్రశాంతంగా గడపవచ్చు.