Headlines

AP Panchayat Elections: ఏపీ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల


AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నవంబర్ 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తొలి విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది.

నవంబర్ 17 వరకు నామినేషన్ల స్వీకరణ

తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నవంబర్ 15 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. నవంబర్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. నామినేషన్ల స్వీకరణ పూర్తయిన మరుసటి రోజు, అంటే నవంబర్ 18న అధికారులు వాటిని పరిశీలించనున్నారు.

నామినేషన్ల తిరస్కరణపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు నవంబర్ 19, 20 తేదీల్లో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఈసీ. ఈ అప్పీళ్ల పరిష్కారం అనంతరం నవంబర్ 21న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉంటుంది. అదే రోజు బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు.

నవంబర్ 26న తొలి విడత పోలింగ్

తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 26న నిర్వహించనున్నారు. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం కానుంది. అయితే ఎన్నికల సమయంలో ఏదైనా కారణంతో పోలింగ్ నిర్వహించలేని చోట్ల లేదా రద్దయిన చోట్ల నవంబర్ 27న రీపోలింగ్ నిర్వహించనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *