ఏజెన్సీలోకి మళ్లీ ‘పెద్దపులి’ ఎంట్రీ.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట !

ఏజెన్సీలోకి మళ్లీ ‘పెద్దపులి’ ఎంట్రీ.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట !


ఏలూరు ఏజెన్సీ ప్రాంత వాసులకు మళ్లీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది ఓ పెద్దపులి. సుమారు 70 రోజుల క్రితం కొత్తూరు ప్రాంతంలో రెండు పశువులను చంపి, అధికారులను, స్థానికులను ముప్పుతిప్పలు పెట్టిన టైగర్‌ను భారీ ఆపరేషన్ చేపట్టి బంధించిన రెస్క్యూ టీమ్‌ పులిని అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. అయితే, ఇప్పుడు అదే పులి మళ్లీ జనారణ్యంలోకి ప్రవేశించడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ పులి కదలికలు చాలా విచిత్రంగా ఉన్నాయి. పగటిపూట వెదురు పొదల్లో సేదతీరుతూ ‘రెస్ట్’ తీసుకుంటున్న పులి, రాత్రి వేళల్లో అటవీ మార్గాల గుండా ప్రయాణిస్తోంది. తాజాగా పోలవరం జిల్లా మంటూరు వద్ద గోదావరి దాటిన పులి, వాడపల్లి-కొత్తూరు ప్రాంతంలోకి ప్రవేశించింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద మరోసారి గోదావరి దాటి తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్లి, మళ్లీ ఏలూరు జిల్లా కొత్తూరు సమీపంలోని పెద్దూరు కాలువ వెంబడి బస చేసినట్లు అధికారులు గుర్తించారు.

మరిన్ని వీడియోల కోసం :

ఆహా అనిపిస్తున్న పోచమ్మ ట్రైలర్‌!

ఎన్టీఆర్ బీస్ట్ మోడ్.. కొత్త లుక్‌తో తారక్ సర్‌ప్రైజ్

షారుఖ్‌ ప్లేస్‌ని రణ్‌వీర్‌ కొట్టేస్తారా?

కోలీవుడ్‌లో సీక్వెల్స్‌ జోరు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *