Headlines

ఏం సినిమా రా బాబు ! మెంటలెక్కే సైకలాజికల్ థ్రిల్లర్.. త్వరలోనే ఓటీటీలోకి


‘పంచాయత్’, ‘కోటా ఫ్యాక్టరీ’ వంటి వెబ్ సిరీస్‌లతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న విలక్షణ నటుడు జితేంద్ర కుమార్, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 4 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక సమాచారం వెలువడింది. ఈ సినిమా కథ మొత్తం సూరజ్ (జితేంద్ర కుమార్), అతని కుమారుడు ఆది చుట్టూ తిరుగుతుంది. తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో సూరజ్ తన కొడుకు ఆదితో కలిసి ముంబైలోని ఒక భారీ, విలాసవంతమైన భవనంలోకి మారతాడు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో, ఒకరోజు ఆది అకస్మాత్తుగా ఆ భవనంలో నుంచి మాయమవుతాడు.

తన కొడుకు ఏమయ్యాడో తెలియక సూరజ్ తీవ్ర ఆందోళనకు గురవుతాడు. ఆది కోసం వెతుకుతున్న క్రమంలో ఆ భవనంలో ఒకదాని తర్వాత ఒకటిగా వింత ఘటనలు, ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. అసలు ఆ భవనంలో దాగి ఉన్న రహస్యాలు ఏంటి.? ఆది అదృశ్యం వెనుక ఎవరి హస్తం ఉంది.? ఈ మిస్టరీని ఛేదించే క్రమంలో సూరజ్ ఎలాంటి మానసిక సంఘర్షణకు గురయ్యాడు.? అనే అంశాలను అత్యంత ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు.

ఎక్కువగా కామెడీ, ఎమోషనల్ పాత్రల్లో మెప్పించిన జితేంద్ర కుమార్, ఈసారి పూర్తిస్థాయి సీరియస్ అలాగే ఇంటెన్స్ థ్రిల్లర్ కథను ఎంచుకోవడం విశేషం. ఆద్యంతం సస్పెన్స్‌తో సాగే ఈ కథనం, జితేంద్ర నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు డిసెంబర్ 4న ఈ చిత్రం క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఇస్తుంది. ఇక ఈ సినిమాను అస్సలు మిస్ చేసుకోకండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *