ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం ఇప్పుడు తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. పర్వతారోహకుల తాకిడి పెరగడంతో అక్కడి పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. ప్రతి ఏటా ఎవరెస్ట్ బేస్ క్యాంపులో ఏర్పాటు చేసే దాదాపు 1600 గుడారాలు, కిచెన్లు, జనరేటర్లు, వైఫై వంటి ఆధునిక సౌకర్యాల వల్ల నేల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. అధిక ఎత్తులో ఉండటం వల్ల క్లైంబర్లు ఎక్కువ నీరు తాగుతుంటారు. దీనివల్ల ఉత్పత్తి అయ్యే మూత్రం కూడా హిమానీనదం కరగటానికి కారణమవుతోంది. ఒక 2023 సీజన్‌లోనే రోజుకు సుమారు 6,766 లీటర్ల మూత్రం ఉత్పత్తి అవగా, దీని విడుదల చేసే వేడి కారణంగా ఆ ఒక్క సీజన్‌లోనే హిమానీనదం ఏకంగా 154 టన్నుల మంచును కోల్పోయినట్లు పరిశోధకులు తేల్చారు. అయితే, మూత్రం కంటే బేస్ క్యాంపులో వాడే ఇంధనమే అతిపెద్ద సమస్యగా మారింది. వంట, వేడి, విద్యుత్ కోసం వందలాది ఎల్పీజీ సిలిండర్లు, వేల లీటర్ల కిరోసిన్, గ్యాసోలిన్‌ను వినియోగిస్తున్నారు. మానవ కార్యకలాపాల వల్ల హిమానీనదం కరగడంలో ఈ ఇంధన వినియోగమే దాదాపు 94 శాతం కారణమని నేపాల్, అమెరికన్ శాస్త్రవేత్తల బృందం రీజనల్ ఎన్విరాన్‌మెంటల్ చేంజ్ జర్నల్ లో ఆందోళనకర విషయాలను వెల్లడించింది. గ్లోబల్ వార్మింగ్‌తో పాటు ఈ మానవ తప్పిదాలు హిమానీనదాలను ప్రమాదకర స్థాయికి చేర్చుతున్నాయి. ఇటీవల నేపాల్‌లో సంభవించిన భారీ ఆకస్మిక వరదలకు ఇలాంటి ముప్పులే కారణమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ముస్తాబైన ఖైరతాబాద్ గణపయ్య.. పంచముఖ సంకటహర మహా గణపతిగా దర్శనం
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది కింగ్ కోబ్రా
పెన్షన్ లేని వారికి గుడ్ న్యూస్! సెప్టెంబర్ 7-16 వరకు దరఖాస్తులు..ఏఏ పత్రాలు కావాలో తెలుసా?
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, ఉరుములు,మెరుపుల బీభత్సం! ముప్పులో ఉత్తరాది రాష్ట్రాలు
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు.. ఆదివారం అసలేం జరిగింది?