తెలంగాణ రాష్ట్రంలో రాగల నాలుగు నుంచి ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ హెచ్చరించారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నప్పటికీ, వేసవికాలంలో ఉపరితల వాతావరణంలో ఏర్పడే మార్పుల వల్ల ఇది సాధారణమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో నిజామాబాద్ (40.7°C), మహబూబ్ నగర్ (40.5°C) జిల్లాల్లో నిన్న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 38-40°C వరకు ఉష్ణోగ్రతలు ఉంటున్నాయని, కాంక్రీట్ నిర్మాణాలు, జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం వల్ల ఒకటి నుంచి రెండు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని శ్రీనివాస్ వివరించారు. పొల్యూషన్, ఏసీల వినియోగం వల్ల కూడా నగరంలో వేడిమి పెరుగుతుందని ఆయన తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :