Headlines

ఉపాధి హామి పనుల్లో భాగంగా తవ్వకాలు.. తళుక్కున మెరుస్తూ కనిపించాయ్.. ఏంటా అని చూడగా


కర్ణాటకలోని బెళగావి జిల్లాలో అరుదైన బంగారు నిధి బయటపడింది. సావదత్తి తాలూకాలోని ఇంచల్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనుల సందర్భంగా మొత్తం 14 పురాతన బంగారు నాణేలు లభించాయి. బీబీజీ రాంజీ పనుల్లో నిమగ్నమైన కూలీలు ఈ నాణేలను గుర్తించారు. కూలీలు తమ నిజాయితీని చాటుకుంటూ, లభించిన ఈ పురాతన నాణేలను తమ వద్దే ఉంచుకోకుండా గ్రామ పంచాయతీ కార్యాలయం ద్వారా అధికారులకు అప్పగించారు. అధికారులు ఈ నాణేల వివరాలను వెల్లడించారు. ఒక్కో నాణెం సగటున 3.92 గ్రాముల బరువు ఉందని, మొత్తం 14 నాణేల బరువు 54.8 గ్రాములు ఉందని తెలిపారు.

ఈ నాణేలన్నింటిపైనా ఒకే తరహా డిజైన్ ఉందని, ఒకవైపు ఏనుగు బొమ్మ, మరోవైపు పురాతన కాలానికి చెందిన డిజైన్ ఉన్నట్లు గుర్తించారు. తహసీల్దార్ అంచనా ప్రకారం, ఈ 14 నాణేల మొత్తం విలువ సుమారు రూ.8,20,000 ఉండవచ్చు. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ నాణేలు సుమారు 800 నుంచి 1000 సంవత్సరాల క్రితం నాటివని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ నాణేలు ఏ కాలానికి చెందినవి, వాటి చారిత్రక ప్రాధాన్యం ఏమిటనేది పురావస్తు నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే స్పష్టమవుతుంది. ఈ అరుదైన ఆవిష్కరణ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు బయట ఎక్కడైనా 10 రూపాయలు కనిపిస్తేనే చప్పిడి కాకుండా జేబులు వేసుకుని వెళ్లిపోతున్నారు. అలాంటిది బంగారం దొరికినా అధికారులకు ఇవ్వడం మాములు విషయం కాదు.

Gold Coins

Gold Coins

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *