ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని బయటపెట్టిన డాక్టర్

ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని బయటపెట్టిన డాక్టర్


ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని బయటపెట్టిన డాక్టర్

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఊబకాయం. జాతీయ ఆరోగ్య సర్వే గణాంకాల ప్రకారం.. దేశంలో 24 శాతం మంది మహిళలు, 23 శాతం మంది పురుషులు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు కాలేయం, గుండె వంటి కీలక అవయవాలపై ఒత్తిడి పెంచి ప్రాణాపాయానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీళ్లు తాగితే పొట్ట కరిగిపోతుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇందులో వాస్తవమెంత అనే అంశంపై మారంగ్ ఆసియా హాస్పిటల్ మెటబాలిక్ డిజార్డర్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ పరాస్ అగర్వాల్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

వేడినీళ్లతో బరువు తగ్గుతారా..?

వేడినీళ్లు తాగడం వల్ల మెటబాలిజం స్వల్పంగా పెరుగుతుందనే మాట వాస్తవమే కానీ, అది నేరుగా బరువును తగ్గించేస్తుందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని డాక్టర్ అగర్వాల్ స్పష్టం చేశారు. వేడినీళ్లు శరీర ఉష్ణోగ్రతను స్వల్పంగా పెంచి కొన్ని కేలరీలను కరిగించవచ్చు, కానీ కేవలం నీళ్లు తాగడం వల్ల మాత్రమే పొట్ట కొవ్వు కరిగిపోతుందని ఆశించడం భ్రమ మాత్రమే.

బరువు పెరగడానికి ప్రధాన కారణాలు

శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి డాక్టర్ పరాస్ మూడు ప్రధాన కారణాలను వివరించారు..

అతిగా తినడం: శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకోవడం.

శారీరక శ్రమ లేకపోవడం:రోజంతా కూర్చుని ఉండటం వల్ల ఖర్చు కాని శక్తి కొవ్వుగా మారుతుంది.

చెడు ఆహారపు అలవాట్లు: పిజ్జా, బర్గర్లు, ప్యాక్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర ఉన్న పానీయాలు తీసుకోవడం.

పొట్ట కొవ్వును కరిగించే సింపుల్ సూత్రాలు

బరువు తగ్గడానికి వేడినీళ్ల వంటి షార్ట్ కట్‌ల కంటే క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు.

కేలరీల నియంత్రణ: మీరు ఇంతకుముందు మూడు రొట్టెలు తింటే, ఇప్పుడు రెండు తినడం ప్రారంభించండి. అంటే క్రమంగా ఆహార పరిమాణాన్ని తగ్గించాలి.

జంక్ ఫుడ్‌కు స్వస్తి: బిస్కెట్లు, చాక్లెట్లు, శీతల పానీయాలు, నూనెలో వేయించిన పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టాలి.

ఇంటి భోజనమే మేలు: ఆకుకూరలు, పప్పులు, అన్నం, పండ్లు మరియు డ్రై ఫ్రూట్స్ వంటి పోషకాహారాన్ని తీసుకోవాలి.

కదలిక అవసరం: జిమ్‌కు వెళ్లకపోయినా పర్వాలేదు, కానీ ప్రతిరోజూ అరగంట వ్యాయామం చేయాలి. ఆఫీసులో లిఫ్టుకు బదులు మెట్లు వాడటం, ప్రతి అరగంటకు ఒకసారి లేచి నడవడం వంటివి అలవాటు చేసుకోవాలి.

మానసిక ఆరోగ్యం: సరిపడా నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది.

మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గకపోతే, దానికి ఏదైనా అంతర్లీన ఆరోగ్య సమస్య కారణమేమో వైద్యుల ద్వారా పరీక్షించుకోవడం ఉత్తమం. సరైన ఆహారం, నిరంతర శ్రమ మాత్రమే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *