ఈ చిన్న పదార్థం మీ బంగారు నగలకు పెద్ద శత్రువు! జస్ట్‌ టచ్‌చేస్తే చాలు.. ఐస్‌లా కరిగిపోవాల్సిందే..!

ఈ చిన్న పదార్థం మీ బంగారు నగలకు పెద్ద శత్రువు! జస్ట్‌ టచ్‌చేస్తే చాలు.. ఐస్‌లా కరిగిపోవాల్సిందే..!


బంగారం అంటే ఇష్టం లేని వారుండరు. ఖరీదు ఎంతైన సరే పసిడికి డిమాండ్‌ ఎప్పుడూ తగ్గదు. ఇక మగువలకు అయితే, గోల్డ్‌ ఉంటే సరిపోతుంది..ఓ పూట పస్తులుండమన్న ఉంటారు..! మహిళలకు బంగారం అన్న, నగలన్న అంత క్రేజ్. ఎంతో కాలం జాగ్రత్తగా దాచుకున్న బంగారు నగలు ఒక్క నిమిషంలో తమ మెరుపును కోల్పోయి, విరిగిపోతే ఎంత బాధగా ఉంటుంది? అచ్చం ఇలాంటి మార్పునే కలిగిస్తుంది ఒక చిన్న పదార్థం. బంగారం మెరుపును తక్షణమే పోగొట్టి, దానిని నాశనం చేయగల ఒక ప్రమాదకరమైన పదార్థం గురించి ఆసక్తికరమైన వివరాలు వెల్లడయ్యాయి. అది మరేదో కాదు పాదరసం (Mercury). దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధారణంగా బంగారంపై యాసిడ్లు కూడా అంత త్వరగా ప్రభావం చూపవు. కానీ పాదరసం మాత్రం బంగారానికి అత్యంత ప్రమాదకరం. బంగారం మీద పాదరసం పడగానే అది బంగారాన్ని తనలో కరిగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియలో ఏర్పడే మిశ్రమాన్ని గోల్డ్ అమల్గమ్ అంటారు. పాదరసం తగిలిన వెంటనే పసిడి మెరుపు మాయమై, అది వెండిలాగా తెల్లగా లేదా బూడిద రంగులోకి మారిపోతుంది. చాలామంది తమ బంగారం నకిలీదేమో అని భ్రమపడతారు. కానీ నిజానికి అది పాదరసం వల్ల జరిగిన రసాయనిక చర్య. ఇది బంగారం అంతర్గత నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది. పాదరసం ఒక సాధారణ లోహం కాదు. అది బంగారంలోకి చొచ్చుకుపోయి దాని అణువులను చెదరగొడుతుంది. దీనివల్ల మీ విలువైన ఆభరణాలు కేవలం తాకినంత మాత్రాన విరిగిపోయేంత మృదువుగా తయారవుతాయి. దీనివల్ల ఆభరణాలు ఎంతో పెళుసుగా మారి, చిన్న ఒత్తిడికి కూడా ముక్కలైపోతాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

మన ఇళ్లలో ఉండే పాత థర్మామీటర్లు లేదా బ్యాటరీలలో పాదరసం ఉంటుంది. అవి పొరపాటున పగిలితే, అందులోని పాదరసం మీ ఉంగరాలు లేదా గొలుసులకు తగలకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ పొరపాటున తగిలితే, వెంటనే ఆ నగలను తీసివేయాలి. పాదరసం కేవలం నగలకు మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి కూడా విషపూరితమైనది. దాని ఆవిరి ఊపిరితిత్తులకు, నరాల వ్యవస్థకు హాని కలిగిస్తుంది. పాదరసం బంగారాన్ని, వెండిని నాశనం చేస్తుంది కానీ, ఇనుమును మాత్రం ఏమీ చేయలేదు. అందుకే పాదరసాన్ని ఎప్పుడూ ఇనుప పాత్రలలో భద్రపరుస్తారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *