ఇరాన్‌ రైళ్ళపై దాడులకు ఇజ్రాయెల్ ప్లాన్‌

ఇరాన్‌ రైళ్ళపై దాడులకు ఇజ్రాయెల్ ప్లాన్‌


ఇరాన్‌ రైళ్ళపై దాడులకు ఇజ్రాయెల్ ప్లాన్‌

పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకీ తీవ్రమవుతోంది. హోర్మూజ్‌ జలసంధి ని తిరిగి తెరిచేందుకు ఇరాన్‌ కు అధ్యక్షుడు ట్రంప్‌ ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ట్రంప్‌ ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటారోనన్న భయాల మధ్య ఇరాన్‌ దేశవ్యాప్తంగా ఉన్న పవర్‌ ప్లాంట్ల వద్ద మానవహారాలుగా ఏర్పడాలని ప్రభుత్వం యువతకు పిలుపునిచ్చింది. గడువు ముగిసేలోపు హర్మూజ్‌ను తెరవకపోతే.. ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్‌ కేంద్రాలను నేలమట్టం చేస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. అంతకుముందులా డెడ్‌లైన్‌ను పొడిగించేది లేదని చెప్పారు. దీంతో అమెరికా దాడుల నుంచి ఆ విద్యుత్‌ కేంద్రాలను రక్షించుకునేందుకు ఇరాన్ చర్యలు మొదలుపెట్టింది. ఇరాన్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఖదేమీ మరణించారు. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించారు. ఆయన కుమారుడు, కొత్త సుప్రీం లేడర్ మొజ్తబా ఖమేనీని లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా, ఇజ్రాయెల్ తాజాగా హెచ్చరించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం అపస్మారక స్థితిలో (స్పృహలో లేరని) ఉన్నారని, దేశ పాలనా బాధ్యతలు నిర్వర్తించలేని స్థితిలో ఉన్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత మోజ్తబా ఈ పదవిని చేపట్టారు. ప్రస్తుతం ఆయనకు టెహ్రాన్‌కు బదులుగా పవిత్ర నగరమైన కోమ్‌లో అత్యంత రహస్యంగా చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. భద్రతా కారణాలరీత్యా మోజ్తబాను అక్కడికి తరలించినట్లు నివేదికలు చెబుతున్నాయి. గత కొన్ని రోజులుగా మోజ్తబా బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇరాన్‌లోని రైళ్ల నే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు ఇజ్రాయెల్‌ ప్లాన్‌ చేస్తోంది. రానున్న 12 గంటల పాటు రైలు ప్రయాణాలకు, రైలు మార్గాలకు దగ్గర్లో ఉండే ప్రజలు అక్కడినుంచి దూరంగా వెళ్లిపోవాలని ఇజ్రాయెల్‌ సైన్యం హెచ్చరించింది. ‘ఎక్స్‌’ ఖాతాలో ఐడీఎఫ్‌ ఈ పోస్టు పెట్టింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విశాఖలో మౌనిక హత్య కేసులో వెలుగులోకి కీలక అంశాలు

వీళ్లు మామూలు దొంగలు కాదు.. 12 నిమిషాల్లో.. కేజీ బంగారాన్ని కొట్టేశారు

Allu Arjun: బన్నీ బర్త్‌డే హంగామా..ఇంటి ముందు వేలాది మంది అభిమానులు..

ఒడిశా టు విజయవాడ.. కారులో తరలిస్తున్న రూ. కోట్లు పట్టివేత

ప్రపంచానికి గుడ్ న్యూస్..దిగొస్తున్న చమురు ధరలు.. ట్రంప్ కు తప్పని తలపోటు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *