ఇరాన్ చమురుపై అమెరికా ఉక్కుపాదం.. సడలింపుల పొడిగింపునకు ‘నో’

ఇరాన్ చమురుపై అమెరికా ఉక్కుపాదం.. సడలింపుల పొడిగింపునకు ‘నో’


పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేసే కీలక నిర్ణయాన్ని అమెరికా వెల్లడించింది. ఇరాన్ చమురు విక్రయాలపై గతంలో ఇచ్చిన తాత్కాలిక సడలింపులను పొడిగించే ప్రసక్తే లేదని యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. టెహ్రాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ‘ఎకనామిక్ ఫ్యూరీ’ వ్యూహాన్ని మరింత కఠినతరం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు కొరత ఏర్పడకుండా ఉండేందుకు గత నెలలో అమెరికా ఇరాన్‌పై ఆంక్షలను స్వల్పంగా సడలించింది. అయితే, ఈ వెసులుబాటు కేవలం తాత్కాలికమేనని బెసెంట్ గుర్తుచేశారు. ఈ నెల 19తో ముగియనున్న ఈ గడువును పెంచబోమని, తద్వారా ఇరాన్ ఇంధన కార్యకలాపాలను పూర్తిగా అరికట్టడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ అక్రమ ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే విదేశీ బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలపై కూడా కఠినమైన ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా హెచ్చరించింది. సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురు కొనుగోళ్లకు ఇచ్చిన అనుమతులు త్వరలోనే ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా తీసుకున్న ఈ తాజా నిర్ణయం అంతర్జాతీయ చమురు ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ఇంధన సరఫరాపై ఆందోళనలు కొనసాగుతుండగా, మరోవైపు అమెరికా తన ఆంక్షల పట్టును బిగించడం వల్ల మార్కెట్‌లో ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. సర్వదర్శనం టోకెన్ల జారీలో మార్పులు

ఆరేళ్ల బాలుడికి కృష్ణానదిలోకి విసిరేసిన తండ్రి.. కారణం తెలిస్తే షాకవుతారు

Singer Chitra: సింగర్ చిత్ర భావోద్వేగం.. గుండెను పిండేసేలా పోస్ట్

Mushroom: వామ్మో.. ఇది పుట్ట గొడుగా.. గొడుగా ??

గ్యాస్‌ కష్టాలు.. ఆటోలో సిలిండర్లను లాక్కెళ్ళిన మహిళలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *