ఇదో వింత ఏటీఎం.. మీ దగ్గర ఉన్న బంగారాన్ని అందులో వేస్తే చాలు.. అరగంటలో నగదు మీ ఖాతాలోకి!

ఇదో వింత ఏటీఎం.. మీ దగ్గర ఉన్న బంగారాన్ని అందులో వేస్తే చాలు.. అరగంటలో నగదు మీ ఖాతాలోకి!


సాధారణ ఏటీఎంల ద్వారా డబ్బులు విత్‌డ్రా చేయడం మనకు తెలుసు. కానీ, చైనాలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన గోల్డ్ మెల్టింగ్ ఏటీఎం బంగారాన్ని నేరుగా నగదుగా మారుస్తుంది. ఈ వినూత్న యంత్రంలో వినియోగదారులు తమ వద్ద ఉన్న పాత బంగారు ఆభరణాలు, నాణేలు లేదా గోల్డ్ బార్‌లను డిపాజిట్ చేయవచ్చు. చైనా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సరికొత్త గోల్డ్ రీసైక్లింగ్ ఏటీఎం బంగారాన్ని తక్షణమే నగదుగా మార్చే వీలును కల్పిస్తుంది. ఈ వినూత్న మిషన్ కేవలం నగదు విత్‌డ్రా చేయడానికి మాత్రమే కాదు, బంగారాన్ని రీసైకిల్ చేయడానికి రూపొందించబడింది.

వినియోగదారులు తమ వద్ద ఉన్న గోల్డ్ బార్‌లు, నాణేలు లేదా ఆభరణాలను ఈ ఏటీఎం మిషన్‌లో ఉంచాలి. మిషన్ లోపల ఉన్న అత్యాధునిక సెన్సార్లు, స్కానింగ్ వ్యవస్థ ఆ బంగారం క్యారెట్లు, బరువును ఖచ్చితంగా లెక్కిస్తాయి. దీంతో ఆ మిషన్ అక్కడికక్కడే బంగారాన్ని కరిగించి, దాని నాణ్యతను నిర్ధారిస్తుంది. ఈ ప్రక్రియ అంతా డిజిటల్ స్క్రీన్‌పై వినియోగదారుడికి కనిపిస్తుంది. బంగారం విలువను లెక్కించిన తర్వాత, వినియోగదారుడు అంగీకరిస్తే కేవలం 30 నిమిషాలలోనే ఆ మొత్తం వారి బ్యాంక్ ఖాతాలో లేదా డిజిటల్ వాలెట్‌లో జమ అవుతుంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌గా మారటంతో నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల ప్రయోజనాలు ఏంటని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ మిషన్‌ ఆధారంగా బంగారాన్ని అమ్మేటప్పుడు బయట దుకాణాల్లో మోసపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఏటీఎం పక్కాగా స్వచ్ఛతను లెక్కిస్తుంది. బ్యాంకులకు లేదా నగల దుకాణాలకు వెళ్లి గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు.
అర్ధరాత్రి పూట కూడా అత్యవసరంగా డబ్బు కావాల్సి వస్తే, ఇంట్లో ఉన్న బంగారంతో తక్షణమే నగదు పొందవచ్చు.

చైనాలో వైరల్ అవుతున్న ఈ టెక్నాలజీ భవిష్యత్తులో ఇతర దేశాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఆపదలో ఆదుకునే ‘పుత్తడి’ని తక్షణ నగదుగా మార్చే ఈ ఏటీఎం సౌకర్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *