Headlines

ఇదేం పనిరా.. కోరిక తీర్చాలంటూ వదిన వెంట పడ్డాడు.. కట్ చేస్తే, చివరకు ఏం జరిగిందంటే..

ఇదేం పనిరా.. కోరిక తీర్చాలంటూ వదిన వెంట పడ్డాడు.. కట్ చేస్తే, చివరకు ఏం జరిగిందంటే..


ఖాజీపూర్ గ్రామానికి చెందిన హైమద్ అలియాస్ అహ్మద్ ఇటీవలే తనకున్న వ్యవసాయ భూమిలో ఎకరం భూమి అమ్మేసి కోళ్లఫామ్ వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించాడు. అందులో భాగంగా వచ్చిన డబ్బుతో గ్రామ శివారులోని మిగిలిన ఐదు ఎకరాల భూమిలో కోళ్లఫామ్ నిర్మాణం చేపట్టాడు. ఇంటి వద్దే ఉంటూ ప్రతిరోజు ఆ పనులను చూసుకుంటున్నాడు. హైమద్, తన మామ తో కలిసి రాత్రిళ్లు అక్కడే పడుకొని పనులను పర్యవేక్షిస్తున్నాడు. అయితే హైమద్ భార్య సాహెబి చెల్లి కుటుంబంతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఒకరికొకరు అర్థికంగా సహాయాలు చేసుకున్నారు. ఈ క్రమంలో సాహెబిపై చెల్లి భర్త ఖాజా కన్నేశాడు. తన లైంగిక వాంఛ తీర్చాలని ఒకనాడు కోరడంతో ఆమె నిరాకరించింది. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగింది. ఇటీవలె హైమద్ భూమి అమ్మిన విషయం తెలుసుకొని తన ఇంటి నిర్మాణం కోసం ఖాజా 5లక్షల రూపాయలు అప్పు అడిగాడు. తనకే అవసరాలు ఉన్నాయని తాను ప్రస్తుతం అప్పు ఇవ్వలేనని హైమద్ చెప్పాడు.

అటు తోడల్లుడు హైమద్ అప్పు ఇవ్వలేదు.. ఆయన భార్య తన కోరిక తీర్చలేదని కక్ష పెంచుకున్నాడు చెట్టుకింది ఖాజా. ఈ క్రమంలో హైమద్ ను అంతమొందిస్తే… ఆస్తితో పాటు ఆయన భార్య సొంతమవుతుందని భావించి దారుణానికి ప్లాన్ చేశాడు. ఈ నెల 27న ఖాజీపూర్ శివారులో నిర్మిస్తున్న కోళ్లఫామ్ షెడ్డు వద్ద హైమద్ ఒంటరిగా ఉన్నాడని తెలుసుకొని.. మాట్లాడాలని అక్కడికి వెళ్లాడు. ఇద్దరి మధ్య అప్పు విషయం మరోసారి చర్చకు వచ్చింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. ఇక అప్పటికే కక్షతో రగిలిపోతున్న ఖాజా తోడల్లుడు హైమద్ ను హత్య చేయాలని భావించాడు. అక్కడే ఉన్న సిమెంట్ ఇటుకతో హైమద్ తలపై బాదాడు. దీంతో తీవ్ర రక్తగాయాలతో హైమద్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం ప్రక్కనే ఉన్న బోర్ మోటర్ స్విచ్ ఆన్ చేసి ఘటనస్థలిలో ఉన్న రక్తపు మరకలు, ఇతర ఆధారాలు లేకుండా మొత్తం క్లీన్ చేశాడు. ఏమి ఎరగనట్టు ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం హైమద్ పక్కనే ఉన్న వ్యవసాయ పొలం యజమాని చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.

పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు వెలుగులోకి:

ఇక ఘటనపై భార్య సాహెబి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఘటనస్థలిలో ఆధారాల కోసం వెళ్లగా ఏమి లభించలేదు. అయితే పోలీసుల విచారణ సమయంలో నిందితుడు ఖాజా వారి వెంటే ఉండడం విశేషం. ఎవరికి ఎలాంటి అనుమానం కలగకుండా మృతుడి అంత్యక్రియల్లోనూ పాల్గొన్నాడు. హైమద్ తో వైరం ఉన్న వారి వివరాలు, ఇతర కోణాల్లో పోలీసులు దర్యాప్తును వేగం చేశారు. ఈ క్రమంలో చెట్టుకింది ఖాజాపైన పోలీసులకు అనుమానం కలిగింది. అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు నుంచి రక్తపు మరకలు ఉన్న దుస్తులు, ఒక బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం న్యాయస్థానంలో హజరుపరిచి రిమాండ్ కు తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *