Headlines

ఇది కదా కావాల్సింది.. జియో, ఎయిర్‌టెల్, వీఐ యూజర్లకు బిగ్ గుడ్ న్యూస్.. ఇక తక్కువకే..


ఇది కదా కావాల్సింది.. జియో, ఎయిర్‌టెల్, వీఐ యూజర్లకు బిగ్ గుడ్ న్యూస్.. ఇక తక్కువకే..

మొబైల్ యూజర్లకు భారత టెలికాం నియంత్రణ సంస్థ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇంటర్నెట్ అవసరం లేకపోయినా డేటాతో కలిపి వచ్చే ఖరీదైన రీఛార్జ్ ప్యాకేజీలను తప్పనిసరిగా తీసుకోవాల్సిన దుస్థితికి చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగింది. కేవలం వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్ సేవలు మాత్రమే కోరుకునే వారి కోసం ప్రత్యేకమైన, చవకైన రీఛార్జ్ వోచర్లను అందుబాటులోకి తేవాలని టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. ప్రస్తుతం మొబైల్ రీఛార్జ్ చేయాలంటే డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఎస్సెమ్మెస్‌లు అన్నీ కలిపి ఒకే ప్యాకేజీగా వస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు, వయోవృద్ధులు, సాధారణ ఫీచర్ ఫోన్లు వాడే వారు ఇంటర్నెట్ వాడకపోయినా భారీ మొత్తంలో డబ్బు వెచ్చించి ఫుల్ ప్యాక్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. నెలవారీ రీఛార్జుల కోసం కుటుంబ బడ్జెట్ తలకిందులవుతోందని, కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే ప్రత్యేకంగా ప్లాన్లు తీసుకురావాలనే డిమాండ్ వినియోగదారుల నుంచి చాలా కాలంగా వినిపిస్తోంది.

ఈ సమస్యపై దృష్టి సారించిన ట్రాయ్, జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి అన్ని ప్రధాన టెలికాం కంపెనీలు తమ ప్లాన్ల నిర్మాణాన్ని మార్చుకోవాలని స్పష్టం చేసింది. ఇకపై డేటాతో సంబంధం లేకుండా 30 రోజులు లేదా అంతకంటే తక్కువ వ్యాలిడిటీతో కూడిన ప్రత్యేక వాయిస్ కాలింగ్, ఎస్సెమ్మెస్ వోచర్లను కచ్చితంగా ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. దీనివల్ల వినియోగదారులపై అనవసర ఆర్థిక భారం తప్పనుంది.

సులభంగా చెప్పాలంటే.. కేవలం ఫోన్ కాల్స్ మాత్రమే మాట్లాడుకునే వారిపై ఇంటర్నెట్ డేటాతో కూడిన ఖరీదైన రీఛార్జ్ ప్యాక్‌లను బలవంతంగా రుద్దకూడదన్నదే ట్రాయ్ తాజా ఆదేశాల ప్రధాన లక్ష్యం. దీని ద్వారా యూజర్లు తమ వాడకం, అవసరాలు, ఆర్థిక స్తోమతకు తగిన రీఛార్జ్ ప్లాన్‌ను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లభిస్తుంది. అయితే ఈ కొత్త ప్లాన్ల ధరలు ఎంత ఉండనున్నాయి, టెలికాం కంపెనీలు మార్కెట్లోకి వీటిని ఎప్పటి నుంచి అమల్లోకి తెస్తాయనే పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *