ఆ పాత్ర ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి తాండవిస్తోందట.. కోటీశ్వరుడు కావడం ఖాయమట..!

ఆ పాత్ర ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి తాండవిస్తోందట.. కోటీశ్వరుడు కావడం ఖాయమట..!


ఆ పాత్ర ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి తాండవిస్తోందట.. కోటీశ్వరుడు కావడం ఖాయమట..!

రైస్‌ పుల్లింగ్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. పాతా నాణేలు, ఇత్తడి చెంబు, మ్యాజిక్‌ కాయిన్స్‌ అంటూ మోసాలకు దిగుతున్న ఘరానా ముఠాను పలమనేరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముఠాలో నలుగురు అరెస్ట్‌ కాగా…ఇద్దరు పరారీలో ఉన్నారు. కుంబార్లపల్లికి చెందిన క్రిష్ణప్ప, కమ్మేపల్లికి చెందిన షేక్‌ ఇలియాజ్‌, కర్ణాటక కోలార్‌కు చెందిన మునీష్‌, చౌడేపల్లికి చెందిన విజయ్‌కుమార్‌, రాజులూరుకి చెందిన శంకర్‌, పెద్దపంజాణికి చెందిన నాగరాజు అరెస్ట్‌ అయ్యారు. అంతా ముఠాగా ఏర్పడి రైస్‌ పుల్లింగ్‌ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. తమిళనాడు కృష్ణగిరికి చెందిన శేఖర్‌తో రైస్‌ పుల్లింగ్‌ ముఠా సంప్రదింపులు జరిపింది. రాయలపేటలో ఆంజనేయస్వామిగుడి దగ్గరకు వస్తే తమ దగ్గర ఉన్న మహిమ గల చెంబు ఇస్తామని నమ్మబలికారు. చెంబు దక్కితే కోటీశ్వరుడవుతావని మాయ మాటలు చెప్పారు. దీంతో ఆశపడ్డ బాధితుడు 5 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. కేటుగాళ్ల మాయమాటలను నమ్మి ముందుగా లక్ష చెల్లించి చెంబు తీసుకున్నాడు. ఇంటికివెళ్లాక అది పనికిరాని చెంబని తేలడంతో బోరుమన్నాడు.బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ముఠాను అరెస్ట్‌ చేశారు.ఇలాంటి మోసపూరిత మాటలను ఎవరూ నమ్మొద్దని సూచించారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *