Headlines

ఆలూ తొక్కలు వేస్ట్‌ కాదండోయ్.. ఇలా చేశారంటే అద్దిరిపోయే స్నాక్‌ రెడీ!

ఆలూ తొక్కలు వేస్ట్‌ కాదండోయ్.. ఇలా చేశారంటే అద్దిరిపోయే స్నాక్‌ రెడీ!


మనం ఇంట్లో బంగాళాదుంపలతో కూరలు, ఫ్రై లేదా పరాటాలు చేసేటప్పుడు వాటి తొక్కలను తీసి పారేయడం అలవాటు. అయితే ఆధునిక సస్టైనబుల్ కుకింగ్ లేదా జీరో వేస్ట్ కాన్సెప్ట్‌లో భాగంలో ఈ వ్యర్థాలతోనే అద్భుతమైన, క్రిస్పీ స్నాక్స్ తయారుచేస్తున్నారు. ఆలూ తొక్కలతో చేసుకునే చిప్స్ రుచిలోనే కాకుండా ఆరోగ్య పరంగానూ ఎంతో మేలు చేస్తాయి.

బంగాళాదుంప గుజ్జు కంటే దాని తొక్కలోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయని ఆహార నిపుణులు చెబుతారు. ఇందులో జీర్ణక్రియను మెరుగుపరచడానికి తొక్కలోని పీచు పదార్థం తోడ్పడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యానికి సహాయపడతాయి. రక్తపోటును అదుపులో ఉంచడానికి, రక్తహీనతను తగ్గించడానికి ఇవి ఉపయోగపడతాయి.

క్రిస్పీ ఆలూ పీల్ చిప్స్ తయారీ విధానం:

ముందుగా బంగాళాదుంప తొక్కలపై మట్టి ఉంటుంది. కాబట్టి, వాటిని నీటిలో 2-3 సార్లు బాగా కడిగి, పొడి గుడ్డపై వేసి తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టాలి. బాగా ఆరిన తొక్కల్లో 1 స్పూన్ నూనె, రుచికి సరిపడా ఉప్పు, కారం, చాట్ మసాలా, కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఈ తొక్కలను వేడి నూనెలో దోరగా వేయించవచ్చు, లేదా ఎయిర్ ఫ్రైయర్/ఓవెన్ ఉంటే 180°C వద్ద 10-12 నిమిషాలు క్రిస్పీగా అయ్యే వరకు బేక్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి



బాగా వేగిన చిప్స్‌పై కొద్దిగా నిమ్మరసం చల్లుకుని టమోటా సాస్ లేదా మైయోనైజ్‌తో తింటే టీ టైమ్‌లో అద్భుతమైన స్నాక్‌గా పనిచేస్తుంది. ఇంట్లోనే తక్కువ ఖర్చుతో, పోషకాలతో కూడిన స్నాక్స్ తయారుచేసుకోవడానికి ఈ జీరో వేస్ట్ రెసిపీ అద్భుతమైన మార్గం. ఇకపై ఆలూ తొక్కలను పారేయకుండా ఈ రుచికరమైన చిప్స్‌ను ఇంట్లోనే ప్రయత్నించండి!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *