Headlines

ఆమె చాలా తెలివైంది.. ఇలా నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు : ఉదయభాను


ఆమె చాలా తెలివైంది.. ఇలా నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు : ఉదయభాను

యాంకర్ ఉదయభాను తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ యాంకర్ సుమ కనకాల గురించి, అలాగే తన తండ్రి గొప్పతనం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఉదయభాను దృష్టిలో యాంకర్ సుమ అత్యంత తెలివైన, ప్రతిభావంతురాలైన యాంకర్ అని వెల్లడించారు. సుమ తెలివితేటల వల్లే అన్ని షోలు చేయగలుగుతున్నారని, ఇంత పోటీ ఉన్న రంగంలోనూ ఆమె విజయవంతంగా నిలదొక్కుకోగలిగారని ఉదయభాను ప్రశంసించారు. “నాకు తనతో ఎటువంటి శత్రుత్వము, ఎటువంటి మిత్రత్వము రెండూ లేవు. కానీ ఆమె చాలా తెలివైన యాంకర్. ఇలా నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు” అని ఉదయభాను స్పష్టం చేశారు. ఆ తెలివితేటలు అందరికీ ఉండవని, సుమకు మలయాళీ బ్లడ్ బిజినెస్ బ్లడ్ రెండూ ఉన్నాయని, అందుకే ఆమె స్మార్ట్‌గా వ్యవహరిస్తుందని ఉదయభాను పేర్కొన్నారు.

Aditi Myakal : మేడమ్ సార్ మేడమ్ అంతే..! మెంటలెక్కిస్తున్న అర్జున్ రెడ్డి భామ

అంతేకాకుండా, ఉదయభాను తన తండ్రి గొప్ప వారసత్వం గురించి అనేక విషయాలు పంచుకున్నారు. తన తండ్రి కలం పేరు కూడా ఉదయభాను అని, ఆయన కోహెడ్‌లో విగ్రహం ఉన్న గొప్ప వ్యక్తి అని తెలిపారు.  ఒక వ్యక్తికి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఊర్లో విగ్రహం పెట్టడం అసాధ్యమని, ఇది తన తండ్రి గొప్పతనాన్ని తెలియజేస్తుందని ఉదయభాను అన్నారు. తన తండ్రి రాసిన కవితలన్నీ బయటకు వచ్చి ఉంటే బాగుండేదని, అయితే తాను చిన్నప్పుడే నాన్నకి దూరమవడం వల్ల వాటిని భద్రపరచలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి కవితలు విప్లవాత్మకంగా ఉండేవని, అప్పటి పెత్తనం, దొరల మీద ఆయన కవితలు రాసేవారని, ఊరంతా కూర్చొని ఆయన కథలు వినేదని ఊరి ప్రజలు తనకు చెప్పేవారని గుర్తు చేసుకున్నారు.

ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.. కట్ చేస్తే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది

తన తండ్రి గురించి ఒక జ్ఞాపకాన్ని కూడా ఉదయభాను పంచుకున్నారు. ఒక బాపు, రాములు మామ అని పిలవమనే వ్యక్తి, ఒకరోజు తమ ఇంటికి వచ్చి, చిన్నపిల్ల అయిన ఉదయభాను కాళ్ళు పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడని, ఆమె వేలును తన తండ్రి వేలితో పోల్చుకొని “నాన్న కాళ్ళు, నాన్న కాళ్ళు” అని ఏడ్చాడని తెలిపారు. ఇది తన తండ్రి పట్ల ప్రజలకు ఉన్న ఆదరాభిమానాలకు నిదర్శనమని పేర్కొన్నారు. తన తండ్రి దాదాపు 150 ఎకరాల భూమిని గ్రామానికి దానం చేశారని, ఆయన ఒక జమీందారని ఊరి ప్రజలు చెప్పేవారని ఉదయభాను వెల్లడించారు. ఆయనకు ఉన్న భావజాలమే ఆ దానానికి కారణమని, అయితే తమ కుటుంబం ఆ ఆస్తి నుంచి ఒక్క చిల్లిగవ్వ కూడా తీసుకోలేదని ఉదయభాను స్పష్టం చేశారు.

అప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే మాజీ సీఎం భార్య.. ఇద్దరి మధ్య 27ఏళ్ల ఏజ్ గ్యాప్

 

View this post on Instagram

 

A post shared by Suma Kanakala (@kanakalasuma)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *