Headlines

అయ్యో పాపం.. కరెంట్ షాక్‌తో ఆడ చిరుత మృతి! అసలేం జరిగిందంటే..


మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా చిమూరు తాలూకా శంకరాపూర్ గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల వయసున్న ఆడ చిరుత విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. సమాచారం అందుకున్న చిమూరు అటవీ క్షేత్ర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుత కళేబరాన్ని తరలించారు. అనంతరం శవపరీక్షలు నిర్వహించి, ఖననం చేశారు. అసలేం జరిగింది?

మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా చిమూరు తాలూకా పరిధిలోని శంకరాపూర్ గ్రామ సమీపంలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. సుమారు ఐదేళ్ల వయసున్న ఒక ఆడ చిరుత ఆహారం కోసం ఒక వానరాన్ని (కోతిని) వేటాడటం ప్రారంభించింది. చిరుత బారిన పడకుండా తప్పించుకోవడానికి ఆ కోతి గ్రామ సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ స్తంభాలపైకి ఎక్కింది. కోతిని ఎలాగైనా పట్టుకోవాలనే తొందరలో ఆ చిరుత కూడా ఏమాత్రం ఆలోచించకుండా ట్రాన్స్‌ఫార్మర్ స్తంభం పైకి ఎక్కింది.

స్తంభంపై ఉన్న కోతిని వేటాడుతున్న సమయంలో, చిరుత శరీర భాగాలు ప్రమాదవశాత్తు అధిక విద్యుత్ ప్రసారమయ్యే కరెంట్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలాయి. దీంతో తీవ్రమైన కరంట్ షాక్ గురై ఆ ఆడ చిరుత స్తంభం పైనే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. గ్రామ సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్‌పై చిరుత మృతదేహం ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న చిమూరు అటవీ క్షేత్ర అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి, స్తంభం పైనుంచి చిరుత కళేబరాన్ని కిందకు దించారు.

ఇవి కూడా చదవండి



అనంతరం చిరుత మృతదేహాన్ని చిమూరు అటవీ క్షేత్ర కార్యాలయానికి తరలించారు. నిబంధనల ప్రకారం వెటర్నరీ వైద్యులతో పోస్ట్‌మార్టం నిర్వహించిన అటవీ అధికారులు, ప్రాథమిక విచారణ అనంతరం కళేబరాన్ని ఖననం చేశారు. ఆహారం కోసం వెళ్లి చిరుత ఇలా విద్యుదాఘాతానికి గురై మరణించడం స్థానికులను, అటవీ ప్రేమికులను తీవ్రంగా కలచివేసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *