Headlines

అనుకున్నదే అయ్యింది..! పెళ్లిపీటలెక్కబోతున్న బలగం బ్యూటీ.. వరుడు ఎవరంటే


అనుకున్నదే అయ్యింది..! పెళ్లిపీటలెక్కబోతున్న బలగం బ్యూటీ.. వరుడు ఎవరంటే

చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న భామలు చాలా మంది ఉన్నారు. అలాగే మరికొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోలుగా, హీరోయిన్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో కావ్య కళ్యాణ్ రామ్ ఒకరు. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో తన క్యూట్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఇక కావ్య గురించి చెప్పాలంటే గంగోత్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. మసూద సినిమాతో హీరోయిన్ గా మారింది కావ్య కళ్యాణ్ రామ్. తొలి సినిమాతోనే హీరోయిన్ గా ఆకట్టుకుంది. తన నటనతో మెప్పించింది ఈ చిన్నది. నటనతోనే కాదు అందంతోనూ కవ్వించింది కావ్య కళ్యాణ్ రామ్.

అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది.. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది

ఆ తర్వాత వేణు దర్శకత్వంలో బలగం సినిమాలో నటించింది. బలగం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆతర్వాత ఆమె హీరోయిన్ గా చేసిన ఉస్తాద్ సినిమా డిజాస్టర్ అయ్యింది. శ్రీ సింహ హీరోగా నటించిన ఈ సినిమా తర్వాత కావ్య సినిమాలకు గ్యాప్ తీసుకుంది. సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతుంది. 2023లో వచ్చిన ఉస్తాద్ సినిమా తర్వాత కావ్య కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో ప్రేక్షకులను కవ్విస్తుంది కావ్య.

నాకంటే అతనే బాగా సూట్ అవుతాడు..! బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ

ఇదిలా ఉంటే కావ్య కళ్యాణ్ రామ్ తన ప్రియుడిని పరిచయం చేసింది. త్వరలోనే కావ్య పెళ్లిపీటలెక్కనుంది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్, కీరవాణి తనయుడు కాలభైరవ తో కావ్య ప్రేమలో ఉంది. తాజాగా వీరి రిలేషన్ ను కన్ఫర్మ్ చేస్తూ ఫోటోలను షేర్ చేసింది కావ్య. తాజాగా కావ్య తన సోషల్ మీడియాలో కాలభైరవతో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ.. కొంతమంది మన జీవితాల్లోకి వచ్చి, మనం దేవుడికి అత్యంత ప్రియమైన బిడ్డలమనే భావనను కలిగిస్తారు. అలాగే సరైన వ్యక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడు, అంతా గులాబీ రంగులో కనిపిస్తుంది.
నా అత్యంత సాధారణమైన రోజులను ప్రకాశవంతం చేసి, నన్ను ఈ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలిగా భావించేలా చేసినందుకు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది. ఇన్ని రోజులు ప్రేమలో తేలిపోయిన ఈ ఇద్దరూ పెద్దలను ఒప్పించి త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు.

ఆ సినిమాలో ఛాన్స్ అడిగితే ఆ హీరో వద్దు అన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన రాజశేఖర్

 

View this post on Instagram

 

A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *