అంతా నీళ్ల పాలు..! ఆకలి తీర్చే పాలను ఆగం చేశారు.. పర్యావరణవేత్తల ఆగ్రహం

అంతా నీళ్ల పాలు..! ఆకలి తీర్చే పాలను ఆగం చేశారు.. పర్యావరణవేత్తల ఆగ్రహం


అంతా నీళ్ల పాలు..! ఆకలి తీర్చే పాలను ఆగం చేశారు.. పర్యావరణవేత్తల ఆగ్రహం

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక మతపరమైన వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నర్మదా నది పట్ల భక్తులకు ఉన్న అపారమైన విశ్వాసం ఒకవైపు, వనరుల వృథాపై జరుగుతున్న విమర్శలు మరోవైపు ఈ ఘటనను వివాదాస్పదం చేశాయి. నర్మదా జయంతి ఉత్సవాల్లో భాగంగా స్థానిక భక్తులు మరియు కొందరు నిర్వాహకులు కలిసి నదికి భారీ స్థాయిలో పాలతో అభిషేకం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ట్యాంకర్ల ద్వారా వేల లీటర్ల పాలను తీసుకువచ్చి నదిలోకి వదిలేశారు. నదిని నర్మదా మాతగా కొలిచే తాము, ఆమెను సంతోషపెట్టడానికే ఇలా చేశామని భక్తులు చెబుతున్నారు.

ఈ ఘటనపై ప్రధానంగా మూడు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. తమ సంప్రదాయం ప్రకారం నదులకు అభిషేకం చేయడం పూర్వీకుల నుండి వస్తున్న ఆచారమని, దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదని విశ్వాస పరుల వాదిస్తుండగా, భక్తి అనేది ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు లేదా వనరులను వృథా చేయకూడదు అనేది హేతువాదుల వాదన. వేల లీటర్ల పాలను నదిలో పోయడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదని, అదే పాలను అనాథాశ్రమాలకు లేదా మురికివాడల్లోని పిల్లలకు ఇస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని సూచిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇదిలా ఉంటే.. పాలు నదిలో కలిసినప్పుడు అది నీటిలోని ఆక్సిజన్ స్థాయిలను తగ్గిస్తుంది. దీనివల్ల నదిలోని చేపలు, ఇతర జీవరాశుల మనుగడకు ముప్పు వాటిల్లుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *