అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..

అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..


ప్రజలకు భూమి, అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తిని పెంచే విషయంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఎప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగా ఎర్త్ డే 2026 సందర్భంగా ‘యువర్ నేమ్ ఇన్ ల్యాండ్‌శాట్’ పేరుతో ఒక కొత్త, ఆసక్తికర టూల్‌ను పరిచయం చేసింది. భూమిపై నదులు, పర్వతాలు, పచ్చిక బయళ్లు వంటి సహజ సిద్ధమైన ఆకృతులలో దాగి ఉన్న అక్షరాలను గుర్తించి, వాటితో మన పేరును మనం చూసుకునే అద్భుతమైన అవకాశాన్ని ఈ టూల్ కల్పిస్తుంది. ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్న ‘ల్యాండ్‌శాట్’ శాటిలైట్ కార్యక్రమంలో ఇది ఒక భాగం. భూమికి సంబంధించిన భౌగోళిక, అంతరిక్ష విజ్ఞాన అంశాలను ప్రజలకు మరింత చేరువ చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ టూల్ సహాయంతో ఎవరైనా తమ పేరును లేదా తమకు ఇష్టమైన వారి పేరును ఇంగ్లీషులో టైప్ చేస్తే, శాటిలైట్ చిత్రాలలో ఆయా అక్షరాలను పోలి ఉండే సహజ భూ స్వరూపాలను వెతికి, ఒకచోట చేర్చి మన పేరును మనకు చూపిస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా మన గ్రహం భౌగోళిక వైవిధ్యాన్ని, అద్భుతమైన సౌందర్యాన్ని ప్రజలకు నాసా పరిచయం చేస్తోంది. ఈ టూల్‌ను ఉపయోగించడం చాలా సులభం. ముందుగా నాసా అధికారిక వెబ్‌సైట్‌లోని “యువర్ నేమ్ ఇన్ ల్యాండ్‌శాట్” పేజీని సందర్శించాలి. అక్కడ కనిపించే ఖాళీలో A నుంచి Z వరకు ఉన్న అక్షరాలను ఉపయోగించి మీ పేరును టైప్ చేయాలి. వెంటనే ఆ టూల్, మీరు టైప్ చేసిన పేరులోని ప్రతి అక్షరాన్ని పోలి ఉండే భూ ఆకృతుల శాటిలైట్ చిత్రాలను వెతుకుతుంది. మీ పేరుతో ఉన్న పూర్తి చిత్రాన్ని ప్రదర్శిస్తుంది. ఆ చిత్రంలోని ప్రతి అక్షరం భూమిపై ఏ ప్రదేశానికి చెందినదో దాని కచ్చితమైన కోఆర్డినేట్స్‌తో సహా తెలుసుకోవచ్చు. తుది చిత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా సోషల్ మీడియాలో స్నేహితులతో షేర్‌ చేయవచ్చు. ఈ టూల్‌తో పాటు, అక్షరాలను పోలిన 72 విభిన్న చిత్రాల ‘ఆల్ఫాబెట్ ఇమేజ్ గ్యాలరీ’ని కూడా నాసా అందుబాటులో ఉంచింది. భూమి భౌగోళిక ప్రాముఖ్యత, పర్యావరణ సవాళ్లపై అవగాహన పెంచేందుకు నాసా చేపట్టిన పలు కార్యక్రమాలలో ఇది ఒకటి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. దివ్య సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు వైరల్

చరణ్ మెరుపు సినిమా ఎందుకు మధ్యలోనే ఆగిపోయింది ??

Dacoit OTT: అప్పుడే OTTలోకి ‘డెకాయిట్’.. ఎప్పుడంటే

Michael: మైఖేల్‌ దెబ్బకు.. బద్దలైన ధురంధర్ 2 రికార్డ్

ఆ కారణంతోనే మతం మార్చుకున్నా.. అసలు విషయం చెప్పిన కార్తీక దీపం సుమిత్ర



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *