
యూట్యూబ్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ బిజినెస్ ఐడియాస్ లో ఒకటి. మీకున్న ఇంట్రెస్ట్ ను యూట్యుబ్ ద్వారా పంచుకోవడం ఎలాగో తెలిస్తే.. మీరూ యూట్యూబర్ అయిపోవచ్చు. అయితే ఎలాంటి ఛానెల్ పెట్టాలనేదేగా మీ డౌట్.. ఎవర్ గ్రీన్ పాపులర్ యూట్యూబ్ ఛానెల్ ఐడియాస్ ఏంటో ఇప్పుడు చూద్దాం
వ్లాగర్
యూట్యూబ్ లో వ్లాగింగ్ అనేది ఎవర్ గ్రీన్ ఐడియా. మీ లైఫ్‌స్టైల్‌నే మీ వృత్తిగా మార్చుకోవాలంటే వ్లాగర్‌గా మారొచ్చు. అంటే మీరు వెళ్లే ప్రదేశాలు, అక్కడ చేసే పనులు.. ఇలా డైలీ లైఫ్ ను వీడియోల రూపంలో అప్లోడ్ చేస్తే చాలు. మీ లైఫ్ ఇంట్రెస్టింగ్ ఉంటే ఎంతోమంది మీకు సబ్స్క్రయిబర్లుగా మారతారు. ఒకసారి రీచ్ పెరిగాక మీరు మరిన్ని వ్లాగింగ్ కేటగిరీస్ ట్రై చేయొచ్చు.
కుకింగ్
వంట చేయడంలో మీరు ఎక్స్పర్ట్ అయితే కొత్తకొత్త ప్రయోగాలు చేస్తూ కుకింగ్ ఛానల్ పెట్టొచ్చు. కుకింగ్, ఫుడ్ కేటగిరీకి ఎప్పడూ డిమాండ్ ఉంటుంది. అయితే వంట చేయడాన్ని బోర్ కొట్టకుండా చూపించగలగాలి. కథ చెప్తూ వంట చేయొచ్చు. లేదా ఇంకా క్రియేటివ్‌గా ఆలోచించొచ్చు. ఇంట్లో ఉండేవాళ్లకు ఇది సులువైన ఆప్షన్. ఫేస్ చూపించకుండానే కుకుంగ్ ఛానెల్ స్టా్ర్ట్ చేయొచ్చు.
రివ్యూ
మీకు అవగాహన ఉన్న విషయాల మీద రివ్యూలు ఇవ్వగలిగితే మీరు రివ్యూవర్‌గా మారిపోవచ్చు. సినిమాల నుంచి క్రికెట్ వరకూ.. మొబైల్ నుంచి రెస్టారెంట్ వరకూ..దేనిమీదైనా రివ్యూలు ఇవ్వొచ్చు. ఈ మధ్య కాలంలో రివ్యూ వీడియోలకు మంచి డిమాండ్ ఉంటోంది. మీ ఎనాలసిస్ నచ్చితే లక్షల మంది మీకు సబ్ స్క్రైబర్లుగా మారతారు.
లెర్నింగ్
ఎడ్యుకేషన్ చానెల్స్ కు యూట్యుబ్ లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. మీరు ఏదైనా సబ్జెక్ట్ లేదా స్కిల్‌లో ఎక్స్పర్ట్ అయితే దాన్ని యూట్యూబ్ ద్వారా ఇతరులకు కూడా నేర్పొచ్చు. పిల్లల సబ్జెక్ట్స్, లాంగ్వేజెస్, ఫిట్నెస్ కోచింగ్, సింగింగ్, డ్యాన్సింగ్ ఇలా దేన్నైనా వీడియోల రూపంలో నేర్పొచ్చు.
షో కేస్
మీరు మ్యూజిక్, డ్యాన్స్, డ్రాయింగ్.. ఇలా ఏదైనా ఆర్ట్ లో మీరు ఎక్స్పర్ట్ అయితే మిమ్మల్ని మీరే షోకేస్ చేసుకోవచ్చు. మీ టాలెంట్‌ను వీడియోల రూపంలో అప్లోడ్ చేస్తూ పాపులర్ అవ్వొచ్చు. ఇదొక ఎవర్ గ్రీన్ ఐడియా.
హౌ టు
డైలీ లైఫ్‌లో ఎదురయ్యే రకరకాల సమస్యలకు మీదైన స్టైల్లో సొల్యూషన్స్ ఇవ్వొచ్చు. ఈజీగా సూదిలో దారం ఎక్కించే టెక్నిక్, ఇల్లు ఎలా సర్దుకోవాలి? టేబుల్ ఎలా బిగించాలి? ఇలా ఏ విషయం మీద అయినా వీడియోలు చేయొచ్చు. ఇలాంటి వాటికి ఆడియెన్స్ ఎక్కువ ఉంటారు. మంచి రీచ్ ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..