ఉద్యోగి జీవితం గురించి అందితే నెలాఖరు వచేసరికి జేబులు ఖాళీ.. వచ్చిన జీతం అలా ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. అందుకనే మంచి జీతం వచ్చే ఉద్యోగం రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే జీవితంలో విజయం సాధించాలంటే.. మీ తెలివి తేటలను ఉపయోగించి కూడా సంపాదించవచ్చు. సోషల్ మీడియా Xలో పోస్ట్ చేసిన పోస్ట్ తో ఇంజనీర్ నెలకు 30 వేలకు పైగా సంపాదిస్తున్నాడు. ఆ యువ ఇంజనీర్ తన X ఖాతాలో ఈ విషయాన్ని షేర్ చేశాడు. అంతేకాదు ఇప్పుడు సంపాదిస్తున్న డబ్బులు.. క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా వచ్చిన ఉద్యోగంలో వచ్చే జీతం కంటే ఎక్కువ అని వెల్లడించాడు. ఈ పోస్ట్‌కి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
@kanavtwt ద్వారా షేర్ చేయబడిన ఈ పోస్ట్‌లో 21 ఏళ్ల యువ ఇంజనీర్ తన జీతం గురించి ప్రస్తావించాడు. “తనకు సగటు టైర్ 3 క్యాంపస్ ఉద్యోగం చేస్తే.. ఎంత సాలరీ వస్తుందో.. దాని కంటే ఎక్కువ జీతం లభిస్తోంది. నేను దీన్ని రెండు నెలల క్రితం ప్రారంభించాను” అని అతను క్యాప్షన్‌లో పేర్కొన్నాడు. తాను ప్రకటన ఆదాయ కార్యక్రమం(Ad Revenue Program), సృష్టికర్త ఆదాయ భాగస్వామ్యం(Creator Revenue Sharing) ద్వారా తాను సంపాదిస్తున్నానని పోస్ట్‌లో పేర్కొన్నాడు. సాంకేతికతకు సంబంధించిన కంటెంట్‌ను పోస్ట్ చేశాడు.
ఇవి కూడా చదవండి
ఆ వైరల్ పోస్ట్ ని ఇక్కడ చూడండి.
posting on x is already paying me more than average tier 3 campus placement and I literally only started 2 months ago pic.twitter.com/KRl9HdSYm4
— kanav (@kanavtwt) September 15, 2025
సెప్టెంబర్ 15న షేర్ చేయబడిన ఈ పోస్ట్‌ని ఇప్పటివరకు రెండు లక్షల మందికి పైగా చూశారు. కొంత మంది తమ సందేహాలను కామెంట్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు తమకు కూడా ఈ పనిపై ఆసక్తి ఉంది. దయచేసి మాకు సలహా ఇవ్వండి” అని వ్యాఖ్యానించారు. మరొక యూజర్ “మంచి ప్రయత్నం, దీన్ని కొనసాగించండి” అని అన్నారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..