World Lung Day 2025: ఈ లక్షణాలు కనిపిస్తే ఊపిరి తిత్తులు డేంజర్ లో ఉన్నట్లే.. నిర్లక్షం వద్దు సుమా..

World Lung Day 2025: ఈ లక్షణాలు కనిపిస్తే ఊపిరి తిత్తులు డేంజర్ లో ఉన్నట్లే.. నిర్లక్షం వద్దు సుమా..


మారిన జీవ శైలితో పాటు వాతావరణంలో మార్పులు కూడా అనేక వ్యాధులకు కారణం అవుతుంది. ముఖ్యంగా వాయు కాలుష్యం బారిన కొన్ని లక్షల మంది మరణిస్తున్నారని.. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 7 మిలియన్ల మంది మృత్యువాత పడుతున్నారని WHO వెల్లడిస్తోంది. 10 మందిలో 9 మంది అధిక స్థాయి కాలుష్య కారకాలతో కూడిన గాలిని పీల్చుకుంటున్నారని తెలియజేస్తుంది. రోజు రోజుకీ పెరుగుతున్న కాలుష్యం, ధూమపానం, క్షీణిస్తున్న జీవనశైలి కారణంగా ఊపిరితిత్తుల సమస్యలు పెరుగుతున్నాయి. ఊపిరితిత్తుల నష్టాన్ని ముందుగానే గుర్తించకపోతే.. సమస్య మరింత తీవ్రమవుతుంది. ప్రజలు ఊపితితిత్తుల ఆరోగ్యంపై చాలా అరుదుగా శ్రద్ధ చూపిస్తారు. అయితే మన శరీరం తరచుగా కొన్ని లక్షణాల ద్వారా మనల్ని హెచ్చరిస్తుందని మీకు తెలుసా..!

ఊపిరితిత్తుల దెబ్బతినడానికి సంబంధించిన ఈ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే.. సరైన చికిత్స తీసుకుంటే ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బతినకుండా నిరోధించవచ్చు. ఊపిరితిత్తుల దెబ్బతినడానికి సంబంధించిన లక్షణాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

నిరంతర దగ్గు: దగ్గును సాధారణంగా జలుబు లేదా గొంతు ఇన్ఫెక్షన్ లక్షణంగా పరిగణిస్తారు. అయితే ఇది మూడు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే.. దగ్గుని విస్మరించవద్దు. ఊపిరితిత్తుల దెబ్బతిన్న సందర్భాల్లో దగ్గు శ్లేష్మంతో పాటు ఉండవచ్చు. ఇది కొన్నిసార్లు రక్తంతో కూడి ఉంటుంది. ఈ సందర్భంలో దగ్గు పొడిగా లేదా శ్లేష్మంతో నిండి ఉంటుంది. కాలక్రమేణా దగ్గు తీవ్రమవుతుంది.

ఇవి కూడా చదవండి

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: నడక, మెట్లు ఎక్కడం లేదా తేలికపాటి శారీరక శ్రమలు చేయడం వంటి రోజువారీ కార్యకలాపాలు చేస్తున్నప్పుడు కూడా ఊపిరి ఆడక ఇబ్బంది పడడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని అనుభవిస్తే.. ఇది ఆందోళన కరమైన విషయం. ఈ లక్షణం ఊపిరితిత్తులు తగినంత ఆక్సిజన్‌ను గ్రహించలేకపోతున్నాయని .. దానిని భర్తీ చేయలేకపోతాయని సూచిస్తుంది. ఇది ఉబ్బసం, ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ లేదా ఊపిరితిత్తుల కణజాలానికి నష్టంతో సంభవించవచ్చు.

ఛాతీ నొప్పి లేదా బిగుతు: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా లేవు అని చెప్పే మరొక ముఖ్యమైన లక్షణం ఛాతీలో నిరంతర నొప్పి, మంట లేదా ఛాతీలో బిగుతుగా అనిపించడం. బలంగా శ్వాస తీసుకోవడం, దగ్గు లేదా నవ్వు తున్నా నొప్పి తీవ్రమవుతుంది. ఈ నొప్పి ఊపిరితిత్తులలో వాపు, ఇన్ఫెక్షన్ లేదా ఇతర కారణాల వల్ల సంభవించవచ్చు. ఛాతీ నొప్పిని ఎప్పుడూ తేలికగా తీసుకోవద్దు. ఎందుకంటే ఇది గుండె సమస్యల లక్షణం కూడా కావచ్చు .

శ్వాసలో గురక: శ్వాస పీల్చుకునేటప్పుడు లేదా వదిలేటప్పుడు వీజింగ్ అనే శబ్దం వస్తుంది. ఊపిరితిత్తులలోని వాయుమార్గాలు ఇరుకైనప్పుడు లేదా మూసుకుపోయినప్పుడు ఇలాంటి శబ్దం వస్తుంది. ఇది ఆస్తమా, అలెర్జీలు, COPD లేదా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సాధారణ లక్షణం.

అలసట, బరువు తగ్గడం: అధిక అలసట, అనుకోకుండా బరువు తగ్గడం కూడా ఊపిరితిత్తుల నష్టానికి ముఖ్యమైన సంకేతం కావచ్చు. ఊపిరితిత్తులు శరీరానికి తగినంత ఆక్సిజన్‌ను సరఫరా చేయలేనప్పుడు, శరీర శక్తి స్థాయిలు తగ్గుతాయి.ఇది నిరంతర అలసట, బలహీనతకు దారితీస్తుంది. ఇంకా శరీరం శక్తిని అందించడానికి కండరాలు,కొవ్వును విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. దీని వలన అకస్మాత్తుగా బరువు తగ్గడం జరుగుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *