మీరు మీ వైఫై పాస్ వర్డ్ చెప్పకపోయినా… మీ వైఫైకి కనెక్ట్ అయ్యేందుకు బోలెడు మార్గాలున్నాయి. లేదా కొన్నిసార్లు మీరే చెప్పి ఉండొచ్చు. దాన్ని వాళ్లు మరొకరికి చెప్పి ఉండొచ్చు. ఏదైతేనేం.. ఇలా మీ వైఫైని మీకు తెలియకుండా చాలామంది వాడే అవకాశం ఉంది. దీన్ని కనిపెట్టి నిరోధించడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
రిమూవ్ ఇలా..
వైఫై రూటర్ ను యాక్సెస్ చేయడం చాలా ఈజీ. కొన్ని ఫేక్ యాప్స్ ద్వారా పాస్‌వర్డ్ హ్యాక్ చేసి లేదా పాస్ వర్డ్ లేకుండా మీ వైఫై రూటర్ కు కనెక్ట్ అవ్వొచ్చు. దీనివల్ల పెద్దగా నష్టం లేకపోయినప్పటికీ మీ డేటా అంతా వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. దీనికై మీరు ఏం చేయాలంటే.. ముందుగా సిస్టమ్‌లో “విండోస్ + ఆర్(R)” నొక్కి, అక్కడ ‘సీఎండీ(cmd)’ అని టైప్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. అక్కడ ‘ipconfig/all’ అని ఎంటర్ చేస్తే.. ఒక లిస్ట్ కనిపిస్తుంది. అక్కడ ‘డిఫాల్ట్ గేట్‌వే’ పక్కన రూటర్ ఐపీ అడ్రస్ కనిపిస్తుంది. ఆ అడ్రస్‌ను కాపీ చేసి, వెబ్ బ్రౌజర్‌లో పేస్ట్ చేయాలి. యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి మీ వైఫై రూటర్‌కి లాగిన్ అవ్వాలి. అక్కడ ‘క్లైంట్స్ లిస్ట్ లేదా ‘కనెక్టెడ్ డివైజ్’లను సెర్చ్ చేయాలి. అప్పుడు రూటర్‌కు కనెక్ట్ అయిన కనెక్షన్లు కనిపిస్తాయి. అక్కడ మీ డివైజ్ లు వరకూ ఉంచుకుని మిగతా వాటిపై క్లిక్ చేసి రిమూవ్ లేదా బ్లాక్ చేయొచ్చు.
పాస్‌వర్డ్ ఇలా..
ఇలా కాకుండా ఇకపై ఎప్పుడూ ఎవరూ కనెక్ట్ చసుకోకూడదు అనుకుంటే.. ముందు మీరు పాస్ వర్డ్ చేంజ్ చేసి.. యూజర్స్ లిమిట్ సెట్ చేయాలి. రూటర్ సెట్టింగ్స్ లో కనెక్టెడ్ డివైజెస్ లిమిట్ లేదా యూజర్స్ లిమిట్ అన్న ఆప్షన్ ఉంటుంది. ఇది రూటర్ కంపెనీని బట్టి మారుతుంది. ఆ ఆప్షన్ వెతికి అక్కడ మీకు ఎన్ని డివైజ్ లున్నాయో అన్ని అంటే 2 లేదా 3.. ఇలా లిమిట్ సెట్ చేస్తే.. అంతకు మించి ఎక్కువమంది మీ రూటర్ కు కనెక్ట్ అవ్వలేరు.
బ్యాండ్ విడ్త్
వైఫైని ఈజీగా యాక్సెస్ చేయకుండా ఉండాలంటే.. వైఫై పాస్‌వర్డ్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఆల్ఫాబెట్ అక్షరాలతో పాటు నెంబర్స్, సింబల్స్ లాంటివి పెట్టాలి. ఇలా చేస్తే.. పాస్‌వర్డ్ హ్యాక్ చేయడం కష్టమవుతుంది. అలాగే రూటర్ లాగిన్ డిటెయిల్స్‌ను అప్పుడప్పుడూ మారుస్తూ ఉండడం వల్ల ఇతరుల కనెక్షన్లన్నీ డిజేబుల్ అవుతాయి. దీంతో పాటు వైఫై కనెక్షన్ లో 5జీ, 2.4జీ అని రెండు బ్యాండ్ విడ్త్ లు ఉంటాయ. 5జీ ఎనేబుల్ చేసుకుంటే వైఫై రేంజ్ తగ్గుతుంది. ఒకవేళ మీరు ఇంట్లోనే ఉంటూ వైఫై వాడతాం అనుకుంటే దీన్ని ఎంచుకోవచ్చు. 5జీ బ్యాండ్ విడ్త్ కు రేంజ్ తక్కువ కాబట్టి మీ వైఫై సిగ్నల్ ఎక్కువ దూరం వరకూ కనిపించదు.
మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..