Weight Loss: మీకు పొట్ట రమ్మన్నా రాదు.. ఈ 6 ఫుడ్స్ తినకపోతే చాలు.. అవేంటో తెలుసా..?

Weight Loss: మీకు పొట్ట రమ్మన్నా రాదు.. ఈ 6 ఫుడ్స్ తినకపోతే చాలు.. అవేంటో తెలుసా..?


ఈ మధ్యకాలంలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో బాధపడుతున్నారు. మన జీవనశైలి, తినే ఆహారమే దీనికి ప్రధాన కారణని చెప్పొచ్చు. చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, వేయించిన ఆహారాలు వంటి కొన్ని రకాల ఆహారాలను తినడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహారాలు బరువు తగ్గడానికి అడ్డంకిగా మారతాయి.

బరువు తగ్గడానికి ఈ ఆహారాలు తినకండి..

చక్కెర పానీయాలు: సోడా, ఎనర్జీ డ్రింక్స్ వంటి చక్కెర పానీయాలు ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. ఇది కొవ్వు పెరగడానికి కారణమవుతుంది. వీటిలో పోషకాలు లేకపోవడం వల్ల ఉబ్బరం, బరువు పెరుగుదల సంభవిస్తాయి.

శుద్ధి చేసిన ధాన్యాలు: తెల్ల రొట్టె, శుద్ధి చేసిన ధాన్యాలలో ఫైబర్ మరియు పోషకాలు తక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచి ఆకలిని పెంచుతాయి. తద్వారా ఎక్కువ ఆహారం తినేలా చేస్తాయి. ఇది పొట్ట చుట్టూ కొవ్వు పెరగడానికి కారణమవుతుంది.

వేయించిన ఆహారాలు: బజ్జీలు, బోండాలు, చిప్స్ వంటి వేయించిన ఆహారాలలో అనారోగ్యకరమైన ట్రాన్స్ ఫ్యాట్స్, దనపు కేలరీలు ఉంటాయి. ఇవి నేరుగా పొట్ట కొవ్వు మరియు వాపుకు దారితీస్తాయి.

ఆల్కహాల్: ఆల్కహాల్ శరీర జీవక్రియను మందగిస్తుంది. కేలరీలను పెంచుతుంది. ఆకలిని ప్రేరేపిస్తుంది. ఇది పొట్ట చుట్టూ కొవ్వు పెరగడానికి ప్రధాన కారణం.

ప్రాసెస్ చేసిన మాంసాలు: బేకన్, సాసేజ్‌లు వంటి ప్రాసెస్ చేసిన మాంసాలలో సోడియం, సంతృప్త కొవ్వు అధికంగా ఉంటాయి. ఇవి ఉబ్బరానికి, బొడ్డు చుట్టూ కొవ్వు పెరగడానికి కారణమవుతాయి. గుండె జబ్బుల వంటి ఆరోగ్య ప్రమాదాలను పెంచుతాయి.

ప్యాక్ చేసిన ఆహారాలు: కుకీలు, క్రాకర్లు, పేస్ట్రీలు వంటి ప్యాక్ చేసిన ఆహారాలలో చక్కెర, హైడ్రోజనేటెడ్ నూనెలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కేలరీలను పెంచి పొట్ట చుట్టూ కొవ్వును పోగు చేస్తాయి.

బరువు తగ్గాలనుకునే వారు వ్యాయామంతో పాటు తమ ఆహారంపై కూడా దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఈ ఆహారాలను దూరంగా పెట్టడం ద్వారా బరువు తగ్గడం సులభతరం అవుతుంది.

( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *