శాఖహారులకు బరువు పెరగడానికి ఉత్తమమైన ఎంపిక పనీర్. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఒక గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటే.. 100 గ్రాముల పనీర్‌లో 13 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాలు, ఎముకలను బలపరుస్తుంది. ఇది బరువు పెరగడానికి కూడా సహాయపడుతుంది.
బరువు పెరగాలనుకునే వారికి చిన్న గుమ్మడికాయ గింజలు మరో మంచి ఎంపిక. ఇవి మనలోని శక్తి స్థాయిలను పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయి. 28 గ్రాముల గుమ్మడికాయ విత్తనాల్లో దాదాపు 9 గ్రాముల ప్రోటీన్‌ను ఉంటుంది. వాటిలో మెగ్నీషియం, జింక్, భాస్వరం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి, ఇవి గుండెను బలంగా ఉంచుతాయి, అలాగే రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతాయి.
బరువు పెరగడానికి కిడ్నీ బీన్స్ కూడా మంచి ఎంపిక. ఇవి రుచికరంగా ఉండడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అర కప్పు ఉడికించిన కిడ్నీ బీన్స్‌లో దాదాపు 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తుంది, రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది.
బురువు పెరిగేందుకు చిక్పీస్ కూడా ఒక సూపర్‌ఫుడ్. అర కప్పు చిక్‌పీస్‌లో 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిలో ఐరన్, ఫాస్పరస్, ఫోలేట్ కూడా ఉంటాయి. ఇవి శరీరంలో శక్తిని నిలుపుకుంటాయి, అలసట నుండి కూడా ఉపశమనం పొందుతాయి.
బరువు పెరగాలనుకునే వారికి వేరుశెనగలు కూడా మంచి ఎంపిక. వీటిని ఎక్కువగా పేద ప్రజల గింజలు అని పిలుస్తారు. ఎందుకంటే ఇవి చైకగా అభిస్తాయి. వీటిని పేదలు ఎక్కవగా తింటారు. వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని ప్రోటిన్ పవర్‌హౌస్ అని కూడా అంటారు. 100 గ్రాముల వేరుశెనగలు దాదాపు 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు,విటమిన్ E కూడా ఉంటాయి, ఇది శరీరాన్ని, రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.