వార ఫలాలు (సెప్టెంబర్ 21-27, 2025): మేష రాశి వారు ఈ వారం ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా పెరుగుపడుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. మిథన రాశివారికి అనుకున్నవి అనుకున్నట్టు జరిగిపోతాయి. ఏ ప్రయత్నం అయినా విజయవంతం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): లాభ స్థానంలో శని, ధన స్థానంలో గురువు ఉన్నంత వరకు ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగా పెరుగుపడుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు, ఆదాయం పెరగడం, పురోగతి చెందడం వంటివి జరుగుతాయి. ఆస్తి వివా దాలు, కోర్టు కేసులు బాగా అనుకూలంగా పరిష్కారమవుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్నేహితుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. జీవిత భాగస్వామికి ఉద్యోగంలో ఆశించిన అభివృద్ధి ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెంచడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. అనుకున్నవి అనుకున్నట్టు జరిగిపోతాయి. ఏ ప్రయత్నం అయినా విజయవంతం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా శుభవార్తలు వింటారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామికి వస్త్రాభరణాలు కొనిస్తారు. పిల్లలు చదువుల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆస్తి సమస్య ఒకటి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ధన స్థానంలో శుక్రుడు, తృతీయంలో రవి, బుధుల సంచారం వల్ల వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆర్థికంగా ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. ఆర్థిక విషయాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి. రాబడి బాగా వృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం అవసరం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఈ రాశికి అత్యంత శుభ గ్రహమైన గురువు లాభ స్థానంలో ఉన్నందువల్ల కొద్ది శ్రమతో ఆదాయం పెరుగుతుంది. అష్టమ శని ప్రభావం చాలావరకు తగ్గుతుంది. వారమంతా ప్రశాంతంగా, సంతోషంగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, సాదా సీదాగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రస్తుతానికి ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం వంటివి పెట్టుకోవద్దు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశాభంగాలు తప్పకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మిత్రుల వల్ల ధన నష్టం జరుగుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఈ రాశినాథుడైన బుధుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం, గురువు దశమ స్థానంలో ఉండడం, ఆరవ స్థానంలో రాహువు సంచారం వంటి కారణాల వల్ల ఈ రాశివారికి వారమంతా ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. వారమంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార భాగస్వాములతో విభేదాలు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రాశ్యధిపతి శుక్రుడు, కుజుడు, శని బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా సంతృప్తిక రంగా, సానుకూలంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అటు వృత్తి, ఉద్యోగాల్లోనూ, ఇటు వ్యాపారాల్లోనూ ఉత్సాహకర, ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆదాయం బాగానే ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభాలనిస్తాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామికి ధన యోగాలు కలుగుతాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఆదాయానికి లోటుండదు కానీ, కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): లాభ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఒకటి రెండు ధన యోగాలు కలుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. మొత్తానికి వారమంతా సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఆందోళన చెందవలసిన పని ఉండదు. ప్రధాన ఆదాయంతో పాటు, అదనపు ఆదాయ మార్గాలు కూడా బాగా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు ప్రయోజనం పొందుతారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం చాలా మంచిది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కొందరు బంధువులకు సహాయం చేస్తారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రాశినాథుడు గురువు సప్తమ స్థానంలో, బుధ, రవులు దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతి లభించడంతో పాటు జీత భత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగా ల్లోనే కాక, కుటుంబంలో కూడా మీ మాటకు, చేతకు తిరుగుండదు. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరగడం, ప్రముఖులతో పరిచయాలు పెరగడం, బంధుమిత్రుల్లో ప్రాధాన్యం ఏర్పడడం వంటివి జరుగుతాయి. కుటుంబంలో సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. ఆరోగ్యం బాగా అను కూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): భాగ్య స్థానంలో రవి, బుధులు, దశమంలో కుజుడి సంచారం వల్ల ఈ రాశికి చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. అదనపు ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి.ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగానేఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): సప్తమ స్థానంలో శుక్రుడు, పంచమ స్థానంలో గురువు, భాగ్య స్థానంలో కుజుడి సంచారం వల్ల ఆదాయానికి, అదృష్టానికి లోటుండదు. వారమంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఏలిన్నాటి శని ప్రభావం బాగా తగ్గుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సానుకూలపడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలేవీ ఉండకపోవచ్చు. నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగిపోతాయి. తండ్రి నుంచి ఆశించిన సహకారం అందుతుంది. పితృవర్గం నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశినాథుడు గురువు చతుర్థ స్థానంలో ఉండడం, సప్తమంలో బుధుడు ఉచ్ఛపట్టడం, పైగా రవితో కలవడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి అవకాశం ఉంది. వ్యాపారాలు చాలావరకు సజావుగా సాగిపోతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, అనుకోని ఖర్చులు, అనవసర ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుకుం టారు. పిల్లలు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. జీవిత కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. రావలసిన సొమ్మును, మొండి బాకీలను పట్టుదలగా వసూలు చేసుకుంటారు.