బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అధికారులు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య, పశ్చిమ మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేశారు. హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 7 నుండి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే రెడ్ అలర్ట్ కూడా జారీ చేసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్రూప్-1 రిజల్ట్స్.. ఎస్సీ స్టడీ సర్కిల్‌కి 30 ర్యాంకులు