ఉదయం నిద్రలేవగానే గ్లాసుడు నీళ్లు తాగడం చాలా మందికి అలవాటు. ఇంట్లో పెద్దలు చాలా మంది ఈ అలవాటును పాటిస్తుంటారు. నిజానికి, ఖాళీ కడుపుతో నీరు తాగడం ఆరోగ్యకరమైన అలవాట్లలో ఒకటి . ఈ అలవాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ ఇది అందరికీ సరిపోదు. ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగడం మంచి అలవాటు అయినప్పటికీ కొంతమంది ఆరోగ్యానికి ఇది మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎవరికి డేంజరో ఇక్కడ తెలుసుకుందాం..
ఉదయం నీరు తాగే అలవాటు కూడా మంచిదే కదా? ఈ ప్రశ్న చాలా మందిలో తలెత్తవచ్చు. నీళ్లు త్రాగడం ఖచ్చితంగా చెడు అలవాటు కాదు. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు నిద్ర లేచిన వెంటనే ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వారి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. దీని వల్ల ప్రయోజనం కంటే హాని ఎక్కువట. కాబట్టి ఖాళీ కడుపుతో నీరు తాగే అలవాటును ప్రారంభించే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.
ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం ఎవరికి మంచిది కాదంటే?
సాధారణంగా నోటి లేదా దంత వ్యాధులు ఉన్నవారు ఖాళీ కడుపుతో నేరుగా నీళ్లు తాగకూడదు. పయోరియా (చిగుళ్ల వ్యాధి), నోటి పూత, నోటి క్యాన్సర్ వంటి సమస్యలు ఉన్నవారు అస్సలు ముట్టుకోకూడదు. ఈ వ్యాధులు ఉన్నవారిలో నోటిలోని లాలాజలంలో హానికరమైన అంశాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వారు ఉదయం నిద్రలేచిన వెంటనే నీరు తాగితే, నీటితో పాటు లాలాజలాన్ని మింగితే, హానికరమైన అంశాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందువల్ల ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నీరు తాగే ముందు నోటిని బాగా శుభ్రం చేసుకోవాలి. అప్పుడు నోటిలోని బ్యాక్టీరియా, విషపూరిత పదార్థాలు తొలగిపోతాయి. ఆ తర్వాత నీళ్లు తాగడం సురక్షితంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి
ఆరోగ్యవంతులైన వ్యక్తులు లాలాజలాన్ని ఉమ్మివేయడం కంటే మింగడం మంచిది. ఎందుకంటే లాలాజలంలోని ఎంజైమ్‌లు జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తాయి. శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అందువల్ల అనవసరంగా లాలాజలాన్ని ఉమ్మివేయడం ఆరోగ్యానికి హానికరం. ఖాళీ కడుపుతో సరిగ్గా నీరు తాగడం, నోటి పరిశుభ్రతను కాపాడుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.