సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని దృశ్యాలు జనాలను తీవ్ర భయాందోళనకు, ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తాజాగా కొందరు పిల్లలకు సంబంధించిన అలాంటి వీడియోనే జనాలను ఆశ్చర్యానికి గురిచేసింది. నీటి మధ్యలో ఉన్న ఒక స్థంభంపైకి ఎక్కిన కొందరు పిల్లలు ఏకంగా హైటెన్షన్ వైర్లను పట్టుకొని ఊయల ఊగినట్టు ఊగారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైరల్ వీడియో ప్రకారం.. ఒక కాలువలో భారీగా నీరు ప్రవహిస్తుంది. ఆ కాలువ మధ్యలో ఒక విద్యుత్ స్తంభం ఉంది. కాలువలో ఈతకొట్టేందుకు వెళ్లిన కొందరు యువకులు.. అక్కడే ఉన్న విద్యుత్ స్థంభాన్ని చూశారు. ఇక దానిపై ఎక్క నీటిలో దూకేందుకు ప్రయత్నించారు.
కొంతమంది పిల్లలు అయితే ఏకంగా విద్యుత్ స్తంభంపైకి ఎక్కి హైటెన్షన్ వైర్లను పట్టుకొని వేలాడుతూ నానా హంగామా చేశారు. తర్వాత కొట్టిసేపటి దాని పట్టుకొని కాలువలోకి దూకాడు. అతని వెంటనే మరో యువకుడు కూడా ఇలానే చేశాడు. అయితే ఇది కొందరు స్థానికులు షాక్కు గురయ్యారు. ఒకవేళ సడెన్గా ఆ హటెన్షన్ వైర్లలో కరెంట్ పాస్ అయితే పరిస్థితి ఏమిటి.. వారు అక్కడే బూడిదైపోతారు కదా అనే భయాందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
అయితే అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఈతతంగాన్నంత వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాప్తా ఇప్పుడు ట్రెండింగ్ మారింది. ఈ వీడియో చూసిన చాలా మంది.. ఎప్పుడు ఇలాంటి ప్రాణాంతకమైన పనులు చేయకూడదని.. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని కామెంట్స్ చేశారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే దాని గురించి మాత్రం ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ యూజర్ కూడా లోకేషన్ మెన్షన్ చేయలేదు.
వీడియో చూడండి..
Some young people are hanging from electric wires and floating in the water below, risking their lives. 🥹🥹 pic.twitter.com/Ek0r8yjb7r
— Dr Aruna Rajput (@VINCT109) September 22, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.