Watch Video: రెచ్చిపోయిన ప్రేమజంట.. నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా ఆపని..

Watch Video: రెచ్చిపోయిన ప్రేమజంట.. నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా ఆపని..


సమాజంలో యువత రోజురోజుకీ దిగజారి పోతున్నారు. చదువుకున్నాం అన్నా కనీస జ్ఞానం లేకుండా ఎక్కడ పడితే అక్కడ పక్కవారిని ఇబ్బందుకుల గురిచేసే పనులు చేస్తున్నారు. మెట్రోల్లో, బైక్‌పై వెళ్తూ నడిరోడ్‌లతో రోమాన్స్‌ చేస్తూ రెచ్చిపోతున్నారు. హైదరాబాద్‌ సహా చాలా ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే చూశాం.. తాజాగా ఇలాంటి ఘటనే రాజస్థాన్‌లో వెలుగు చూసింది. నడిరోడ్డుపై ఈ జంట చేసిన వికృత చేష్టలను చూసిన సదురు వాహనదాలురు షాక్ అయ్యారు. రన్నింగ్ బైక్‌పై రొమాన్స్ చేస్తూ ఓ జంట చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ జంట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైరల్‌ వీడియో ప్రకారం.. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. రాత్రిపూట రహదారిపై బైక్‌ మీద వెళ్తున్న ఒక జంటను మనం చూడవచ్చు. అయితే ఆ బైక్‌పై ఉన్న యువతీ యువకులు ప్రమాదకరంగా బైక్‌ను డ్రైవ్‌ చేస్తూ.. బైక్‌ మీదే రొమాన్స్‌ చేయడం వీడియోలో కనిపిస్తుంది. ఆ యువతి ట్యాంక్ మీద కూర్చుని, బైక్‌ నడుపుతున్న యువకుడిని టైట్‌గా హగ్‌ చేసుకొని కూర్చుంది. ఇది చూసిన సదురు వాహనదారులు ఆశ్చర్యంతో పాటు భయాందోళనకు గురయ్యారు. మరికొందరు దాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారి పోలీసుల దృష్టికి చేరింది. దీంతో స్థానిక సీసీ కెమెరా దృశ్యాలు, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న దృశ్యాల ఆధారంగా ఆ జంటను గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘగిస్తూ ఇలాంటి స్టంట్స్‌ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *