ఆగ్రా, మార్చి 5: కదులుతున్న రైలు ఎక్కడ ప్రమాదకరమని అందరకీ తెలుసు. అయినప్పటికీ కొందరు ప్రాణాలను పణంగా పెట్టి మారీ రిస్క్ చేసి చిక్కులు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పటికే ఎంతో మంది కదులుతున్న రైలు ఎక్కి ట్రైన్ ట్రాక్‌లపై పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు. తాజాగా ఓ మహిళ కదుతులున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే ఆమె పట్టుతప్పి రెండుసార్లు ఫ్లాట్‌ఫారమ్‌పై పడింది. అది చూసిన ప్లాట్ ఫాంపై ఉన్నవారు ఆందోళన చెందారు. అయినప్పటికీ మూడోసారి ప్రయత్నించిన ఆమె అతికష్టం మీద రైలు ఎక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా రైల్వే స్టేషన్లో ఈ సంఘటన జరిగింది.
ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో రైలు ఆగడంతో అందులో ప్రయాణించిన ఒక మహిళ వాటర్ బాటిల్ కోసం దిగింది. అయితే వెంటనే ట్రైన్ కదలడంతో ఫ్లాట్‌ఫారమ్‌పై ఉన్న మహిళ పరుగున ఎక్కేందుకు ప్రయత్నించింది. ట్రైన్లో తన బిడ్డ ఉందని భయపడిన సదరు మహిళా ఎలాగైనా ట్రైన్ ఎక్కాలని భావించింది. ఈ క్రమంలో రైలు కాస్త వేగం పుంజుకోవడంతో ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి పట్టుతప్పి ఫ్లాట్‌ఫారమ్‌పై పడింది. అయినా వెనక్కితగ్గకుండా మరోమారు ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించింది. ఈసారి హ్యాండిల్ జారడంతో మళ్లీ ఫ్లాట్‌ఫారమ్‌పై పడిపోయింది. ఇది చూసి ఫ్లాట్‌ఫారమ్‌పై ఉన్న కొందరు వ్యక్తులు ఆ మహిళను వారించేందుకు పరుగున వెళ్లారు. అయితే వెంటనే పైకి లేచిన మహిళ మూడోసారి రైలు ఎక్కేందుకు ప్రయత్నించింది. మళ్లీ పట్టుతప్పినా ఆమె ట్రైన్ డోర్ వద్ద ఉన్న కొందరు వ్యక్తులు ఆమెను పట్టుకుని లోపలకు లాగడంతో ప్రమాదం తప్పింది. దీంతో ఆ మహిళ ఎంతో ప్రయాసపడి రైలు ఎక్కింది. కానీ ఇలా ప్రమాదకరంగా ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించిన ఆమెకు ఏదైనా జరగరానిది జరిగి ఉంటే ఘోరం జరిగిఉండేది.
ఇవి కూడా చదవండి
🚨 Shocking Scene at Delhi–Agra Route 🚨
A terrifying moment was caught on camera as a woman tried to board a moving train and fell not once, but TWICE 😳
Eyewitnesses say the incident happened on the busy Delhi–Agra railway route, where trains run at high speed and platforms… pic.twitter.com/fbhd8IFTr1
— The Nalanda Index (@Nalanda_index) March 1, 2026
ప్లాట్‌ఫామ్‌పై ఉన్న కొందరు వ్యక్తులు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె రెండు సార్లు విఫలమై మూడో ప్రయత్నంలో ట్రైన్ ఎక్కినప్పటికీ కదులుతున్న ట్రైన్ ఎక్కడం సురక్షితం కాదని నెటిజన్లు కామెంట్ సెక్షన్లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇటువంటి చర్యలు తీవ్రమైన ప్రమాదాలు, ఒక్కోసారి మరణానికి కూడా దారితీస్తాయని అధికారులు హెచ్చరించారు. ప్రయాణికులు అత్యవసరం కంటే భద్రతకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రైలు కదలడం ప్రారంభించిన తర్వాత ప్రయాణీకులు కూర్చుని ఉండాలని, బయలుదేరడానికి తగినంత సమయం ఉంటే తప్ప ఆగిన సమయంలో దిగకూడదని రైల్వే తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.