మూసీ వరద ఉదృతి లో చిక్కుకు పోయిన బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారాన్ని అందచేశారు అధికారులు. జీహెచ్ఎంసీ హైడ్రా జలమండలి విద్యుత్ సిబ్బంది వరద సహాయక చర్యలలో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే బాధితులకు ఆహారం ప్యాకెట్లు అందచేశారు. జంట జలాశయాలు నిండిపోవడంతో వాటి గేట్లు ఎత్తివేశారు. దీంతో నిన్నటినుండి మూసీకి వరద పెరిగింది. శుక్రవారం అర్థరాత్రి వరకే మూసి పరివాహకం లోతట్టు ప్రాంతాలు వరదనీటితో జలమయంగా మారిపోయాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో చాలామంది చిక్కుకుపోయారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.. ప్రస్తుతం ఆహారాన్ని డ్రోన్ల ద్వారా అందిస్తున్నారు.
ఇందులో భాగంగానే మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాల, అధికారులు. ఇదే విధంగా వాటర్ బాటిళ్లను కూడా పంపుతున్నారు. ప్రధానంగా మూసారంబాగ్, అం బేద్కర్ నగర్, మూసానగర్ బస్తీల వాసులకు డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలను అందజేస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.