ఈ మధ్య కాలంలో చాలా మంది బయటఫుడ్‌ను ఎక్కవగా ఇష్టపడి తింటున్నారు. కానీ వ్యాపారులు వాటిని ఎలా తయారు చేస్తున్నారు. వాటి తయారీలో నాణ్యమైన పదార్థాలు వాడుతున్నారా లేదా అనేది మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో పాటు వెళ్లి లాగించేస్తున్నారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన సంఘటన చూస్తే మీరు మరోసారి బయటఫుడ్ తినాలంటేనే భయపడతారు. వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్‌లోని విజయ్ విహార్ కాలనీలో ఉన్న కరీం హోటల్‌లో పనిచేస్తున్న ఒక కార్మికుడు.. రోటీలు తాయారు చేసే క్రమంలో దానిపై ఉమ్మి వేస్తున్నట్లు చూపించే షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన జనాలు హోటల్ కార్మికుడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సంఘటనను గమనించిన ఒక వ్యక్తి ఈ వీడియోపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఘజియాబాద్‌లోని హోటల్‌కు చేరుకొని దర్యాప్తు జరిపారు, ఆ వీడియోలో చపాతీ చేస్తున్న కార్మికుడు అంకుర్ విహార్‌పై కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
పరారీలో నిందితుడైన ఉద్యోగి
ఈ వైరల్ వీడియోపై స్పందించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశామని.. ప్రస్తుతం నిందితుడైన హోటల్ కార్మికుడు అంకుర్ పరారీలో ఉన్నాడని తెలిపారు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.