ఒక వ్యక్తి నడిరోడ్డుపై కార్తో స్టంట్స్ చేస్తూ వాహనదారులను భయందోళనకు గురిచేసిన ఘటన నోయిడాలోని సెక్టార్-142లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు కారు నెంబర్ ద్వారా ఆ వ్యక్తిని పట్టుకొని అతడి నుంచి కారును స్వాధీంన చేసుకున్నారు. వైరల్ వీడియో ప్రకారం.. సెక్టార్-142 సమీపంలో నిత్యం వాహనదారులతో రద్దీగా ఉండే రోడ్డుపై బ్రేజా కారుతో ఒక యువకుడు ప్రమాదకర స్టంట్స్ చేయడం ప్రారంభించాడు. ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేస్తూ.. కారుడోర్ ఒపెన్ చేసి కారును 360 డిగ్రీల తిప్పుటూ ప్రమాదకరంగా స్టంట్స్ చేశాడు. దీనితో రోడ్డుపై వెళ్తున్న సదరు వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.
ఇది గమనించిన కొందరు ఈ స్టంట్ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యువకుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ వీడియో వైరల్గా మారి పోలీసుల దృష్టికి చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీడియోలోని కార్ నెంబర్ ఆధారంగా ఆ యువకుడి ఆచూకీ కనిపెట్టారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని.. అతన్నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు. అలానే అతనిపై కారు 35,000 జరిమానా విధించారు.
వీడియో చూడండి..
#Noida: Stunt driving on the road
Driver performed a 360-degree spin on the road
Taking unnecessary risks, the driver opened the car door and stood outside while driving. — @Noidatraffic @noidapolice @Uppolice pic.twitter.com/6dqvMmqgoC
— Rohit_chaudhary (@rohitch131298) September 27, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.