తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతుండగా. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ధూంధాంగా జరుగుతున్నాయి. విజయవాడలో ఆడపడుచులు దుర్గమ్మను దర్శించుకోగా.. తెలంగాణలో ఆడబిడ్డలు గౌరమ్మ పూజలో నిమగ్నమయ్యారు.. కాగా.. బతుకమ్మ సంబరాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్టెప్పులేశారు. ఆడపడుచులతో కలిసి సరదాగా బతుకమ్మ పాటలకు డ్యాన్స్ చేశారు. దీంతో అక్కడున్న వారంతా తలసాని డ్యాన్స్ వీడియోలను సెల్ ఫోన్లలో రికార్డు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.