జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంటాయి. ఇవి కొన్ని సార్లు జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తే మరికొన్ని సార్లు భయాందోళనకు గురిచేస్తాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి రష్యాలో వెలుగు చూసింది. ఒక వ్యక్తి కారు ఎక్కేందుకు వెళ్లగా అప్పుడే ఒక ఎలుగుబంటి అతనిపైకి దూసుకొచ్చింది. గమనించిన అతను వెంటనే కార్లోకి ఎక్కడి డోర్ వేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డైన ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
సోషల్ మీడియాలో వైలర్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక ఖాళీ ప్రదేశంలో కొన్ని కార్లు పార్క్ చేసి ఉన్నాయి. అక్క ఒక వ్యక్తి బ్లాక్ కారు పార్కు చేస్తూ ఉన్నాడు. ఆ పక్కనే ఉన్న కారు వద్ద మరో వ్యక్తి నిల్చొని ఉన్నాడు.. ఇంతలో అకస్మాత్తుగా చెట్లపొదల్లోంచి బయటకు వచ్చిన ఒక ఎలుగుబండి కారు పక్కన నిల్చున్న వ్యక్తిపై దాడి చేసేందుకు దూసుకొచ్చింది. అది గమనించిన వ్యక్తి వెంటనే కారులోకి ఎక్కడి డోస్ వేసుకున్నాడు. దీంతో రెప్పపాటులో ఎలుగుబంటి నుంచి తప్పించుకున్నాడు.
అయితే అతను తప్పించుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన ఆ ఎలుగుబంటి సమీపంలో ఉన్న పెట్రోపావ్లోవ్స్క్-కామ్చాట్స్కీలోని ఒక పాఠశాల సమీపంలోకి వెళ్లింది. అక్కడ ఒక మహిళపై దాడి చేసి ఆమెను చంపేసింది. అయితే పార్కింగ్ ప్లేస్లో ఉన్న సీసీ కెమెరాల్లో..ఆ వ్యక్తి ఎలుగు బంటి దాడి చేసేందుకు ప్రయత్నించిన దృశ్యాలు రికార్డు కాగా అవి కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన జనాలు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో చూడండి..
Milliseconds SAVED a man in Russia as he jumped into a car to escape a bear attack
Later, the same bear killed a woman near a school in Petropavlovsk-Kamchatsky pic.twitter.com/ve1Ptzc9wz
— RT (@RT_com) September 25, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.