సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని మనం షాక్ అయ్యేలా ఉంటాయి. ఒక్కోసారి ఊహించని ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. అలాంటి ఈ వీడియో కూడా.. యూపీలోని కన్నౌజ్‌లో ఊహించని రీతిలో ప్రమాదం జరిగింది. ఓ వృద్ధ మహిళ ఇంటి ముందు రోడ్డుపై నిల్చోని ఉండగా, ఆమెను అనుకోని ప్రమాదం వెంటాడింది. ఆమె ఇంటి ముందు నిలబడి ఉండగా, ఓ బైకర్ వేగంగా దూసుకొచ్చాడు. రెప్పపాటు వేగంతో ఆ వృద్ధ మహిళను ఢీకొట్టాడు. ప్రమాద తీవ్రతకు వృద్ధురాలు 20 అడుగుల దూరంలో పడింది. ఆ బైకర్ సైతం కింద పడి గాయాలపాలయ్యాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..