
సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి వంకాయల్లోంచి విత్తనాలను తీసివేసి తొక్కలను ఉపయోగిస్తున్నాడు. గింజలు తీసిన తర్వాత అతను ఈ తొక్కలతో దండలు తయారు చేసి ఎండలో ఆరబెట్టాడు. ఈ దండలను చాలా కాలం పాటు ఎండలో ఆరబెట్టిన తరువాత వాటిని ప్లాస్టిక్‌లో ప్యాక్ చేసి అమ్ముతారట. తరువాత ఈ వంకాయ తొక్కల దండలతో ఏం చేస్తారంటే..
ఒక రైతు పొలంలో పొడవైన వంకాయ దండలను ఆరబెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దారానికి కుట్టిన బోలు వంకాయ తొక్కలు ఎండలో పూల దండలలా రెపరెపలాడుతున్నాయి. కానీ ఇది కేవలం అలంకరణ మాత్రమే కాదు, లక్షలాది రూపాయల విలువైన ఎగుమతి వ్యాపారం అంటున్నారు అక్కడి స్థానికులు.
భారతదేశంలో మిగిలిపోయిన వంకాయలను పనికిరానివిగా పారబోస్తారు. కానీ, మధ్యప్రాచ్య దేశాలైన యుఎఇ, కువైట్, సౌదీ అరేబియాలో వాటికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుందట. వ్యాపారులు వాటిని సంచుల నిండా తీసుకుంటారు. తొక్కలను ఎండబెట్టి, సూపర్ మార్కెట్లలో విక్రయించడానికి ప్యాక్ చేస్తారు. ఈ తొక్కలను వివిధ రకాల వంటకాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారట. వీటిని విదేశాలలో గొప్ప ఆనందంతో ఆస్వాదిస్తారట.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
ఈ వంకాయ తొక్కలు తయారు చేయటం చాలా ఈజీ.. కానీ, ఎక్కువ శ్రమతో కూడుకున్నది. ఇందుకోసం ముందుగా పెద్ద వంకాయలను తీసుకుని వాటి లోపలి విత్తనాలను తీసివేస్తారు. తరువాత బోలు తొక్కలను దారంతో దండలుగా కుట్టి ఎండబెడతారు. సుమారు 50-100 వంకాయలను ఒక దండగా కుట్టి ఆరబెడతారు. వీటిని బహిరంగ ప్రదేశంలో వేలాడదీస్తారు. అక్కడ అవి కుంచించుకుపోయి 7-10 రోజులు ఎండలో బాగా ఎండిపోయి తేలికగా మారుతాయి. అలా బాగా ఎండబెట్టిన తర్వాత, వాటిని ప్లాస్టిక్ సంచులలో ప్యాక్ చేసి మార్కెట్లో అమ్ముతారు. ఒక కిలోగ్రాము ఎండిన వంకాయ ధర 150-200 రూపాయలు ఉంటుందట. అదే తాజా వంకాయ ధర 20-30 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఈ విధంగా విదేశీయులు భారతదేశంలోని పనికిరాని వస్తువుల నుండి ఎలా డబ్బు సంపాదించుకుంటున్నారో మనం అర్థం చేసుకోవాలి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..