జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు చెరువులు మత్తడి దూకుతున్నాయి. వాగులు ఉప్పొంగి ప్రవాహహిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహాముత్తారం మండలంలో వాగులు ప్రమాదకరంగా మారాయి. వరదలో బైక్ తో సహా కొట్టుకుపోయిన యువకుడు అదృష్టవశాత్తు బయటపడ్డాడు. ములుగుపల్లి – అంకుశపూర్ గ్రామాల మధ్యలో కల్వర్టు పై నుండి ప్రవహిస్తున్న వరద ప్రవాహంలో ఒక యువకుడు బైక్ సహా కొట్టుకుపోయాడు. వాగు దాటుతూ ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయాడు. అతనికి ఈత రావడంతో బతికి బయటపడ్డాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.