Watch: బెడ్‌రూమ్‌ ఏసీ నుంచి అదే పనిగా శబ్ధాలు.. దగ్గరకు వెళ్లగా కనిపించింది చూసి.. వామ్మో..

Watch: బెడ్‌రూమ్‌ ఏసీ నుంచి అదే పనిగా శబ్ధాలు.. దగ్గరకు వెళ్లగా కనిపించింది చూసి.. వామ్మో..


Watch: బెడ్‌రూమ్‌ ఏసీ నుంచి అదే పనిగా శబ్ధాలు.. దగ్గరకు వెళ్లగా కనిపించింది చూసి.. వామ్మో..

ఇంట్లో ఉన్న, టీవీ, ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మిషన్‌లో అప్పుడప్పుడూ పాములు కనిపించిన ఘటనలు మనం చాలానే చూశాం. సాధారణంగా వర్షకాంలో ఎక్కవుగా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కానీ తాజాగా కేరళలోని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇంట్లో అచ్చం ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. కానీ ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏసీలోంచి ఐదు పాములు బయటకు వచ్చాయి. అది చూసి ఉద్యోగి కంగుతిన్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని శ్రీకార్యం ప్రాంతంలో మాధవ్‌ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతను స్థానికంగా ఉన్న ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజులాగే ఆఫీస్ వెళ్లి ఇంటికి వచ్చిన మాధవ్ ప్రేష్ అయ్యేందుకు బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు. అయితే రూమ్‌ గోడకు ఉన్న ఏసీ కింద ఏవో కదులుతున్నట్టు కనిపించడంతో ఏంటని చూసేందుకు కాస్త దగ్గరగా వెళ్లాడు. అతని ఏసీలోంచి ఏవో చిన్న చిన్న శబ్ధాలు వినిపించాయి. దీంతో ఒక కర్ర తీసుకొని కాస్త జరిపి చూశాడు. ఇంకేముంది అక్కడ పాములు కనిపించాయి. దీంతో వెంటనే ఫోన్ ఓపెన్ చేసి సర్ప యాప్ ద్వారా స్నేక్ క్యాచర్‌, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు.

వెంటనే మాధవ్ ఇంటికి చేరుకున్న స్నేక్ క్యాచర్ ఓ ఏసీ టెక్నీషియన్ సహాయంతో దాని పైన ఉన్న రేకును తెరిచి చూశాడు. అక్కడ దాదాపు 5 పాములు ఉన్నట్టు గుర్తించాడు. ఇక రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ దాదాపు గంటకు పైగా శ్రమించి ఏసీలో లోపల ఉన్న నాలుగు పాములను బయటకు తీశాడు. కానీ ఒక్కటి మాత్రం ఏసీ పైప్‌ నుంచి బయటకు వెళ్లిపోయినట్టు తెలిపాడు.

వీడియో చూడండి..

అయితే ఏసీలో దూరిన పాములు విషపూరితమైనవు కాదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఇంట్లోని కుటుంబ సభ్యులు అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇంతకు ఆ పాములు లోపలికి ఎలా వచ్చాయంటే.. మాధవ్ ఇంటికి కొన్ని చెట్టుకొమ్మలు ఆనుకొని ఉన్నాయని.. వాటిపై నుంచి ఏపీ పైప్ ద్వారా అవి లోపలికి ప్రవేశించి ఉంటాయని చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *