Headlines

Watch: ఈ సముద్రానికి ఏమైంది..? అంతర్వేదిలో భయం.. భయం.. ఉన్నట్టుండి వెనక్కి వెళ్లిన సంద్రం..

Watch: ఈ సముద్రానికి ఏమైంది..? అంతర్వేదిలో భయం.. భయం.. ఉన్నట్టుండి వెనక్కి వెళ్లిన సంద్రం..


అంతర్వేది తీరంలో సముద్రం సయ్యాట ఆడుతోంది. ఎప్పుడూ.. అలలతో ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఉండే సముద్రం ఉన్నట్లుండి 500 మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో స్థానికులు ఆశ్చర్యపోవడంతోపాటు.. భయాందోళన వ్యక్తచేస్తున్నారు. అంతర్వేదిలో సముద్ర తీరంలో ఉన్నట్టుండి నీళ్లు.. 500 మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో సముద్ర తీరమంతా మోకాళ్ళ లోతు ఒండ్రు మట్టితో ఎడారిగా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో సముద్రం తీరం భారీగా వెనక్కి వెళ్లడంతో.. అక్కడ నిర్మానుష్యంగా మారింది.. దీంతో ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

అంతర్వేది తీర ప్రాంతమంతా మోకాళ్ళ లోతు ఒండ్రు మట్టితో నిండి పోవడంతో.. సముద్ర స్నానానికి వెళ్లాలంటేనే పర్యాటకులు, భక్తులు భయపడుతున్నారు. మునుపెన్నడు ఇటువంటి పరిస్థితి అంతర్వేది తీరంలో ఏర్పడలేదని.. సునామి వచ్చే సూచనలు ఉన్నప్పుడే ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.. ఎడారిని తలపించే విధంగా విశాలంగా ఉండే సముద్రం అకస్మాత్తుగా వెనక్కి వెళ్లిపోవడంతో ఏం జరుగుతుందో అన్న భయాందోళన వ్యక్తమవుతోంది.

వీడియో చూడండి..

కాగా.. గతంలోనూ ఇసుక మేటలు వేసి కొన్ని మీటర్ల మేర సముద్రం వెనక్కి వెళ్లినట్లు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఒండ్రు మట్టి ముందుకు వచ్చి సముద్రం వెనక్కి వెళ్లడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *