Vizag: కుప్పలు తెప్పలుగా పాములు.. వామ్మో.! వీడియో చూస్తేనే వణుకు పుట్టాల్సిందే

Vizag: కుప్పలు తెప్పలుగా పాములు.. వామ్మో.! వీడియో చూస్తేనే వణుకు పుట్టాల్సిందే


పాము కనిపించగానే భయంతో పరుగులు తీస్తుంటాం. మరికొందరికి ఆ పదం వింటేనే ఒళ్ళు జలదరిస్తుంది. కానీ ఒకేసారి పదుల సంఖ్యలో పాములను చూస్తే.. కుప్పలు తెప్పలుగా డబ్బాల్లో కనిపిస్తే.. ఎస్.! స్నేక్ క్యాచర్ చేతిలో కట్టలు కట్టలుగా పాములు కనిపిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో విశాఖలో వేరువేరు చోట్ల పట్టిన పాములు ఇవన్నీ.. అత్యంత విషపూరితమైన పది నాగుపాములు.. మరో అయిదు పిల్ల నాగులు.. ఇంకొన్ని ర్యాట్ స్నేక్స్..! ఏంటి ఈ లెక్కలు అనుకుంటున్నారా..? ఇవన్నీ విశాఖ సిటీలో పట్టుబడినవే. అవి కూడా వారం రోజుల వ్యవధిలోనే..! గత కొన్ని రోజులుగా విశాఖలో వర్షాలు కురవడంతో వేర్వేరు చోట్ల జనావాసాల్లోకి వచ్చేసాయి. ఇల్లు, ఆలయాలు, జనావాసాలు లోకి వచ్చి జనాలను హడలెత్తించాయి. అటువంటి పాములను పట్టుకుంది స్నేక్ సేవర్ సొసైటీ కిరణ్ అండ్ టీం. వాటిని డబ్బాలు, సంచుల్లో పెట్టి రెస్క్యూ చేసింది.

ఈ మధ్యకాలంలో.. స్నేక్స్ సేవర్ సొసైటీ సభ్యులు భారీగానే పాములు పట్టుకున్నారు. ఋషికొండ టిటిడి ఆలయం గర్భగుడిలోనూ, ఆంధ్ర యూనివర్సిటి తో పాటు మరికొన్నిచోట్ల వీటిని రెస్క్యూ చేశారు. కేవలం వారం వ్యవధిలోనే.. జెర్రి గుడ్లు, నాగుపాములు, పిల్ల నాగులను క్యాచ్ చేశారు. జనావాసాల మధ్యకు వచ్చి గుబులు పుట్టిస్తున్న పాములన్నిటిని పట్టుకొని బంధించారు. కట్టలు కట్టలుగా ఒకచోట చేర్చి వాటిని విడిచి పెడుతున్నారు. దీంతో హమ్మయ్య అంటూ ఊపిరిపిల్చుకుంటున్నారు విశాఖ జనం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *